Obesity : స్థూలకాయానికి ఆహారంలో మార్పులతోపాటు!….

చిరుతిళ్ళు తరచూ తింటుంటే ఒళ్ళు లావెక్కి పోతుంది. కాబట్టి చిరుతిళ్ళను తగ్గించాలి. ఆకలి లేకుంటే తినటం మానేయాలి. అత్యధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు.

Obesity : స్థూలకాయానికి ఆహారంలో మార్పులతోపాటు!….

Obesity

Obesity : స్ధూల కాయ నివారణకు ఆహారంలో మార్నులు చేస్తే సరిపోదు. అందుకు తగిన విధంగా శరీరానికి వ్యాయామం ఉండాలి. వ్యాయామం లేకుంటే తీసుకున్న ఆహారం సమతుల్యంగా జీర్ణం కాక అనవసర క్యాలరీలు దేహంలో పోగుబడిపోతాయి. దీంతో శరీరం బరువు అధికం అవుతుంది. నీళ్ళు , పానీయాలు అధికంగా సేవించాలి. నీరు ఎంత ఎక్కవ తాగితే అన్ని విధాలుగా మేలు కలుగుతుంది.

నెలకు రెండు రోజుల పాటు ఘన ఆహార పదార్ధాలను మానుకుని దవ్రపదార్ధాలను సేవించాలి. సేవించే పానియాల్లో కూల్ డ్రింక్స్ వంటివి కాకుండా కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్ జ్యూస్ లు వంటివి ఉండేలా చూసుకోవాలి. డైటింగ్ పేరుతో పూర్తిగా తిండి మానేయటం మంచిది కాదు. ఫాస్ట్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి.

స్థూలకాయంతో బాదపడుతున్న వారు తాజా పండ్లను తీసుకోవటం మంచిది. వండిన పదార్ధాలు కాకుండా పచ్చి కూరలు, పచ్చి పండ్లు వంటివి తీసుకోవటం మంచిది. కీరదోసకాయ, బూడిదగుమ్మడికాయ, బీరకాయ, ఆనపకాయ, ముల్లంగి, అరటిదూట వంటివి ఒంట్లో ఉండే నీటి శాతాన్ని బాగా తగ్గించి లావు తగ్గేదుకు దోహదం చేస్తాయి. క్రమం తప్పకుండా ప్రతిరోజు ఏదో ఒక ఆకు కూరను తీసుకోవాలి.

నూనె , నెయ్యి వంటివాటిని బాగా తగ్గించుకోవాలి. నూనె, నేతిలో వేపిన పదార్ధాలను, స్వీట్స్ ను తినటం తగ్గించాలి. మాంసాహారంలో కూడా అత్యధిక క్యాలరీలు ఉండటంతో మాంసాహారాన్ని బాగా తగ్గిస్తే మంచిది. వేడినీళ్ళల్లో కొబ్బరి కలిపి తీసుకుంటే మంచిది. వెల్లుల్లిని ఆహారంలో తరచూ తీసుకుంటుంటే బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

చిరుతిళ్ళు తరచూ తింటుంటే ఒళ్ళు లావెక్కి పోతుంది. కాబట్టి చిరుతిళ్ళను తగ్గించాలి. ఆకలి లేకుంటే తినటం మానేయాలి. అత్యధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు. దుంపలు ఎక్కవగా తినటం తగ్గించాలి. స్ధూలకాయం ఉన్న వారు సగం కడుపు నిండేంతవరకు మాత్రమే తినటం ఉత్తమం.

సైకిలింగ్, వాకింగ్ ఇతరత్రా వ్యాయామాలు తప్పనిసిరిగా చేయాలి. నడిచే అవకాశం లేనివారు ఇంట్లో ఎక్సర్ సైజులు చేయటం మంచిది. బరువు తగ్గించటంలో యోగా ప్రధాన పాత్రను పోషించటమే కాకుండా మానసిక, శారీరక రుగ్మతలను తొలగిస్తాయి. శరీరంలోని క్యాలరీలను తగ్గించటంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.