రిక్షా ఎత్తుకెళ్లారని.. ముగ్గురిని కరెంట్ స్థంభానికి కట్టి..రక్తం కారేలా కొట్టిన స్థానికులు

రిక్షా ఎత్తుకెళ్లారని.. ముగ్గురిని కరెంట్ స్థంభానికి కట్టి..రక్తం కారేలా కొట్టిన స్థానికులు

two men and one woman tied to electricity pole : రాజస్థాన్‌లోని అల్వర్ పట్టణంలో ఓ రిక్షా చోరీ చేశారనే అనుమానంతో ఒక మహిళతో పాటు ముగ్గురిని విద్యుత్ స్తంభానికి కట్టేసి..దారుణంగా కొట్టిన ఘటన చోటుచేసుకుంది. ఈ దొంగతనానిక మాకు ఎటువంటి సంబంధం లేదు..మేమా దొంగతనం చేయలేదని వారు నెత్తూ నోరూ బాదుకున్నా కనికరించకుండా వారిని రక్తం కారేలా కొట్టిన ఘటన శ్యోలాల్‌పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఓ పెద్ద వయస్సు మహిళపై కూడా స్థానికులు దాడి చేశారు.

ఇటీవల వీరు మూడు రిక్షాలను చోరీ చేశారని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ పోలీసులు వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో స్థానికులే వారిని పట్టుకుని కరెంట్ స్థంభానికి కట్టేసి దారుణంగా కొట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను విడిపించారు. దాడికి దిగిన నలుగురు వ్యక్తులను అదుపుతోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా పోలీసులే రిక్షా దొంగలను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని..వారితో కుమ్మక్కు అయ్యారని స్థానికులు ఆరోపిస్తున్నారు. రిక్షా యజమాని చున్నీలాల్ మాట్లాడుతూ తన మూడు రిక్షాలు చోరీకి గురయ్యాయని..పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేసుకోలేదని దొంగలు పోలీసులు ఒకటై..చోరీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించాడు.