Amala Paul : ఆ సినిమా కోసం మార్చురీలోకి వెళ్ళా.. పోస్ట్‌మార్టం చేయడం డైరెక్ట్ గా చూసి షాక్ అయ్యా..

అమలాపాల్ మాట్లాడుతూ.. ''ఇప్పటికే నా సినిమాల్లో చాలా పాత్రలు పోషించాను. కానీ ‘కడవర్‌’ సినిమాలో పోషించిన డాక్టర్‌ భద్ర పాత్ర వేరు. డాక్టర్‌ భద్ర పాత్ర కోసం నేను చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశాను. చిత్ర దర్శకుడితో కలిసి చాలా ఆస్పత్రుల్ని...............

Amala Paul : ఆ సినిమా కోసం మార్చురీలోకి వెళ్ళా.. పోస్ట్‌మార్టం చేయడం డైరెక్ట్ గా చూసి షాక్ అయ్యా..

amala paul

Amala Paul :  కొంతమంది హీరోలు, హీరోయిన్లు సినిమాల్లో చేసే పాత్ర కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఆ పాత్ర ఎలా ఉంటుంది అని నిజ జీవితంలో ఉండే ఆ పాత్రల వద్దకు వెళ్లి మరీ గ్రౌండ్ వర్క్ చేస్తారు. డాక్టర్, పోలీస్, లాయర్.. ఇలా ఏ క్యారెక్టర్ చేస్తే ఆ క్యారెక్టర్ గురించి దగ్గరుండి మరీ తెలుసుకుంటారు. తాజాగా హీరోయిన్ అమలాపాల్ కడవర్‌ సినిమాలో డాక్టర్ పాత్రలో నటించింది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌ ఓటీటీలో రిలీజ్ అయింది. ఈ సినిమాని అమల పాల్ తన సొంత బ్యానర్ పై నిర్మించింది. కడవర్‌ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అమలాపాల్ ఈ సినిమాలోని పాత్ర కోసం ఎంత కష్టపడిందో తెలిపింది.

Ashwini Dutt : చిరంజీవే నాకు టీడీపీ ఎంపీ సీట్ ఇప్పించారు.. నేను కమ్యూనిస్ట్ ని కానీ..

అమలాపాల్ మాట్లాడుతూ.. ”ఇప్పటికే నా సినిమాల్లో చాలా పాత్రలు పోషించాను. కానీ ‘కడవర్‌’ సినిమాలో పోషించిన డాక్టర్‌ భద్ర పాత్ర వేరు. డాక్టర్‌ భద్ర పాత్ర కోసం నేను చాలా గ్రౌండ్‌ వర్క్‌ చేశాను. చిత్ర దర్శకుడితో కలిసి చాలా ఆస్పత్రుల్ని తిరిగాను. చాలా మంది వైద్యులతో మాట్లాడాను. వాళ్ల పనితీరును, అనుభవాల్ని తెలుసుకున్నాను. ఈ సినిమాలో మార్చురీ రూమ్, పోస్టుమార్టం సీన్స్ ఉన్నాయి. వీటి కోసం నిజంగా మార్చురీలోకి వెళ్లాను. పోస్ట్‌మార్టం చేయడాన్ని ఫస్ట్ టైం డైరెక్ట్ గా చూశాను. ఆ పోస్టుమార్టం చూసి ఇలా చేస్తారా అని షాక్ అయ్యాను. ఈ సినిమా కోసం చేసిన అప్రయాణంలో జీవితాన్ని మార్చే అనుభవాన్ని పొందాను” అని తెలిపింది.