139 ఏళ్ల నాటి ఇల్లు..పునాదులతో సహా గాల్లో లేచి అర కిలోమీటరు ప్రయాణం..!!

139 ఏళ్ల నాటి ఇల్లు..పునాదులతో సహా గాల్లో లేచి అర కిలోమీటరు ప్రయాణం..!!

man lifts his entire house to a new address : టెక్నాలజీ సునాయాసంగా మారిపోయాక..అసాధ్యం అంటూ ఏమీ లేకుండాపోతోంది. ఒకప్పుడు సమాచారం ఒకచోటినుంచి మరోచోటికి చేరాలంటే రోజులు..వారాలు పట్టేవి..ఇప్పుడంతా క్షణాల్లోనే చేరిపోతోంది టెక్నాలజీ పుణ్యమాని..ఈ టెక్నాలజీ ఎంతగా డెవలప్ అయ్యిందంటే పునాదులతో సహా భారీ కట్టడాలను సైతం ఒకచోటినుంచి మరోచోటికి తరలించేలా మారిపోయింది. అదికూడా ఏమాత్రం చెక్కు చెదరకుండా..అటువంటి ఘటనలు చాలానే జరిగాయి.

కానీ ఎవరైనా ఇల్లు మారాలనుకుంటే సామాన్లను వాహనాల్లో తీసుకుని మరోచోటికి మారతారు. కానీ అమెరికాలో ఉంటున్న వ్యక్తి మాత్రం తానున్న చోటినుంచి మరోచోటికి మారాలనుకున్నాడు. కానీ తాను ప్రస్తుతం తాను నివసిస్తున్న ఇల్లునే మార్చేయాలనుకున్నాడు…! అదికూడా ఏదో చిన్న ఇల్లు కాదు పేద్ధ భవనం. ఆ భవనానికి 139 ఏళ్ల చరిత్ర ఉంది. ఇది కాస్త విడ్డూరం..ఖర్చుతో కూడుకున్నదే అయినా అతను ఏమాత్రం వెనుకాడలేదు…తన ఇంటిని పునాదులతో సహా గాల్లోకి లేపి తాను ఉండాలనుకునే ప్రాంతానికి తరలించేశాడు…! అంటే ఇక్కడి ఇల్లు తీసి అక్కడ పెట్టేశాడన్నమాట..!!

ఆ 139 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ భవనం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఫ్రాంక్లిన్ స్ట్రీట్ లో ఉంది. 807 నంబరు గల ఈ ఇంటికి చాలా చరిత్ర ఉంది. దాన్ని వదిలేసి మరో ఇంటికి వెళ్లడానికి యజమానికి ఇష్టంలేదు. అందుకే పునాదులతో సహా ఆ భవనాన్ని గాల్లో ఎత్తి ఓ భారీ కంటైనర్ లోపైకి ఎక్కింది ఏదో సామాన్లు తీసుకెళ్లినట్లుగా తన ఇంటిని మరో చోటుకి తరలించాడు…

ఆ పునాదులతో సహా లేపిన ఆ ఇంటిని భారీ వాహనాలపై పెట్టి.. 6 బ్లాక్స్ అవతల అంటే దాదాపు అర కిలోమీటర్ దూరంలో ఉన్న ఉన్న మరో చోటికి తన ఇంటిని మార్చుకున్నాడు. 6 బెడ్ రూమ్స్ తో ఉన్న ఈ విలాసవంతమైన భవనం తరలింపుకు కోసం 15 ఏజెన్సీల పర్మిషన్ కూడా తీసుకుని ఈ ప్రక్రియను సురక్షితంగా పూర్తి చేశారు. అక్కడ నివసిస్తున్న స్థానికుల పర్మిషన్ కూడా తీసుకున్నాడు. భవనం తరలింపు సమయంలో ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పక్కాగా చేసి అనుకున్నది సాధించారు.

ఈ ఇంటిని తరలించడం కోసం కొన్ని చెట్లను నరకటం తప్పలేదు. ఆ చెట్లను పూర్తిగా కాకుండా..కొంతమేరకు కట్ చేయాల్సి వచ్చింది. పార్కింగ్ ప్రాంతాల్ని విస్తరించడంతో పాటు.. ట్రాఫిక్ లైట్లను కూడా మార్చాల్సి వచ్చింది. 6 బెడ్ రూమ్స్ తో ఉన్న ఈ విలాసవంతమైన ఇంటిని మరో చోటికి మార్చేందుకు ఆ భవనం యజమానికి అక్షరాలా 4 లక్షల డాలర్లు ఖర్చు అయింది. అయినా అదో పెద్ద లెక్క కాదు..తనకు ఎంతో ఇష్టమైన ఇల్లు మాత్రం తనకు దక్కిందని మురిసిపోతున్నాడా యజమాని..