ఐ యామ్ యువర్ ‘అమిగో’ అంటున్న సందీప్ కిషన్..

ఐ యామ్ యువర్ ‘అమిగో’ అంటున్న సందీప్ కిషన్..

Amigo Lyrical: టాలెంటెడ్ హీరో సందీప్ కిష‌న్ న‌టిస్తోన్న 25వ చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. టాలీవుడ్‌లో రూపొందుతోన్న తొలి హాకీ ఫిల్మ్‌గా గుర్తింపు పొందిన ఈ న్యూ-ఏజ్ స్పోర్ట్స్ ఎంట‌ర్‌టైన‌ర్ హీరో సందీప్ కిష‌న్‌కి అత్యంత ప్రతిష్ఠాత్మ‌క‌ ప్రాజెక్ట్. డెన్నిస్ జీవ‌న్ క‌నుకొల‌ను ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్న ఈ మూవీలో లావ‌ణ్య త్రిపాఠి హీరోయిన్‌గా న‌టిస్తోంది.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ‌, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్‌, వెంక‌టాద్రి టాకీస్ ప‌తాకాల‌పై టి.జి. విశ్వ‌ప్ర‌సాద్‌, అభిషెక్ అగ‌ర్వాల్‌, సందీప్ కిష‌న్‌, ద‌యా ప‌న్నెం నిర్మిస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 26న ఈ చిత్రం విడుద‌ల‌వుతోంది.

https://10tv.in/a1-express-official-trailer/

బుధ‌వారం ఈ చిత్రంలోని “అమిగో” అంటూ సాగే సాంగ్ లిరిక‌ల్ వీడియోను చిత్ర బృందం విడుద‌ల చేసింది. హిప్‌హాప్ త‌మిళ మ్యూజిక్ అందించిన ఈ పెప్పీ సాంగ్‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి ర‌చించ‌గా, ఇన్నో గెంగా ఆల‌పించారు. మూవీలో ఈ సాంగ్‌ను సందీప్ కిష‌న్‌, లావ‌ణ్యా త్రిపాఠితో పాటు పలువురు డ్యాన్స‌ర్స్‌పై చిత్రీక‌రించారు. హుషారైన బీట్‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ సాంగ్‌లో హీరోయిన్‌పై త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తున్నాడు హీరో.

ఇదివ‌ర‌కు విడుద‌ల చేసిన ట్రైల‌ర్‌కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ ల‌భించింది. భారతదేశం తరఫున ఆడాలని కలలు కనే యువ‌ హాకీ ఆటగాడిగా ఈ మూవీలో సందీప్ కిషన్ న‌టిస్తున్నారు. ఆయ‌న‌ ప్రేమికురాలి పాత్ర‌లో లావణ్య త్రిపాఠి కూడా హాకీ ప్లేయ‌ర్ రోల్ చేస్తుండ‌టం విశేషం. ఆన్‌స్క్రీన్ మీద ఈ జంట చూడ‌ముచ్చ‌ట‌గా ఉంది. ట్రైలర్‌లో త‌న హాకీ స్కిల్స్‌తో సందీప్ కిష‌న్ అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌పరిచారు. ఈ సినిమా కోసం బ‌రువు త‌గ్గి సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించారు సందీప్.