Amit Shah: గద్వాల్‌కు అమిత్‌ షా.. హీట్ పెంచుతున్న తెలంగాణ రాజకీయాలు!

తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి..

Amit Shah: గద్వాల్‌కు అమిత్‌ షా.. హీట్ పెంచుతున్న తెలంగాణ రాజకీయాలు!

Amit Shah

Amit Shah: తెలంగాణ రాజకీయాలలో మెల్లగా హీట్ మొదలవుతుంది. ఇటు రాష్ట్రంలో అధికార పార్టీ టీఆర్ఎస్ జాతీయ స్థాయిలో దేశంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంటే.. రాష్ట్రంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసి ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక.. ప్రగతి భవన్.. రాజ్ భవన్ మధ్య ఏర్పడిన గ్యాప్ మరోవైపు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగానే జాతీయ నేతలు కూడా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు సిద్దపడుతున్నారు.

Telangana : రాజ్ భవన్‌‌లో అపశృతి.. కిందపడిపోయిన గవర్నర్

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 15న రాష్ట్ర పర్యటనకు రాబోతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపడుతున్న రెండోవిడత ప్రజాసంగ్రామ యాత్ర ప్రారంభానికి అమిత్‌ షా రాబోతున్నారట. నిజానికి ఇది ముందు ఏప్రిల్ 14నే అనుకోగా కార్యక్రమంలో జరిగిన మార్పుల కారణంగా 15న అమిత్‌ షా గద్వాల బహిరంగసభలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది.

Telangana Raj Bhavan : రాజ్ భవన్‌‌లో ఉగాది వేడుకలు, సీఎం కేసీఆర్ గైర్హాజర్.. ఫ్లెక్సీలో ప్రధాని, గవర్నర్ ఫొటోలు

జంబులాంబ దేవాలయం సమీపంలో జరగనున్న ఈ బహిరంగ సభ కార్యక్రమం నుండే అమిత్ షా బండి సంజయ్‌ ప్రజా సంగ్రామయాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పాలనపై, బీజేపీపై కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోన్న సీఎం కేసీఆర్‌ జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమి కోసం ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించాలని వ్యూహాలు పన్నుతున్న కేసీఆర్‌ను తెలంగాణలో దెబ్బకొట్టి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

Tamilisai Hot Comments : నాకు ఇగో లేదు, ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదు-ఉగాది వేడుకల్లో గవర్నర్ హాట్ కామెంట్స్

ఈ మేరకు ఎవరికి వారు ఎన్నికల వేడి ఇప్పుడే మొదలు పెట్టినట్లుగా కనిపిస్తుంది. కొన్ని నెలలుగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో జరుగుతోన్న పరస్పర వాదోపవాదాలు, విమర్శలు ఇకపై మరింత పెరిగి రసవత్తరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.