Amitabh Speechless Movement: మెగాస్టార్‌కు స్నేహితుడి అరుదైన బహుమతి!

తొలి వాహనం.. తొలి సంపాదన ఇలా కొందరికి తమ జీవితంలో తొలిసారి దక్కిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం బెంజ్ నుండి ఆడీ వరకు.. ఇంకా ఖరీదైన కార్లు కొనుక్కొనే స్థోమత ఉన్నా కొందరికి తొలిసారి వాడిన కారు మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు.

Amitabh Speechless Movement: మెగాస్టార్‌కు స్నేహితుడి అరుదైన బహుమతి!

Amitabh Speechless Movement

Amitabh Speechless Movement: తొలి వాహనం.. తొలి సంపాదన ఇలా కొందరికి తమ జీవితంలో తొలిసారి దక్కిన అనుభూతిని ఎప్పటికీ మర్చిపోలేరు. ప్రస్తుతం బెంజ్ నుండి ఆడీ వరకు.. ఇంకా ఖరీదైన కార్లు కొనుక్కొనే స్థోమత ఉన్నా కొందరికి తొలిసారి వాడిన కారు మీద ప్రేమ ఎప్పటికీ తగ్గదు. అలా తన తొలి కారు అనుకోకుండా ఉదయం లేచేసరికి సరికొత్తగా ముస్తాబై మన ఇంటి ముందుంటే ఎలా ఉంటుంది. ఆ ఆనందానికి అవధులు ఉండవని చెప్పుకోవచ్చు. సరిగ్గా ఇండియన్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా అలాంటి అనుకోని ఆనందాన్ని పొందారు. తన కుటుంబం అప్పట్లో వాడిన తొలి కార్ ఫోర్డ్ ప్రిఫెక్ట్ ను ఒక స్నేహితుడి అమితాబ్ కు బహుమతికి ఇచ్చాడు.

బచ్చన్ కుటుంబం వాడిన మొదటి కారు 1950 ఫోర్డ్ ప్రిఫెక్ట్. ఆ కారంటే తనకు ఎందుకు అంత ఇష్టమో.. దాని కోసం ఎంతగా ఎదురుచూస్తున్నానో కూడా అమితాబ్ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇది చూసిన ఓ స్నేహితుడు అలాంటి కారునే బిగ్ బీకి బహుమతిగా ఇచ్చాడు. అంతేకాకుండా అప్పట్లో బచ్చన్ వాడిన కారుకున్న రిజిస్టేష్టన్ నెంబర్ యూపీసీ 2882నే ఈ వాహనానికీ అమర్చి బచ్చన్ ఇంటిముందు పార్క్ చేశాడు. పొద్దున్నే తన ఇటిముందున్న ఫోర్డ్ ప్రిఫెక్ట్ వాహనాన్ని చూసి అమితాబ్ ఆశ్చర్యపోయారట. ఇంత అమూల్యమైన గిఫ్ట్ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పేందుకు నోట మాట కూడా రాలేదని బిగ్ బీ తెలిపారు.

Read: Anniyan Remake: హిందీ రీమేక్ హీరోయిన్ ఫైనల్ చేసిన శంకర్!

పసుపు రంగులో ఉన్న ఆ కారుతో దిగిన ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన బిగ్ బీ.. ఈ వాహనాన్ని తనకు బహుమతిగా ఇచ్చిన స్నేహితుడు పేరు అనంత్ అని తన బ్లాగ్ లో పేర్కొన్నారు. కాగా అమితాబ్ కు అంత ప్రేమ గలిగిన కార్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా.. ఫోర్డ్ యూకే సంస్థ ఈ వాహనాన్ని 1938 నుంచి 1961 మధ్య కాలంలో ఉత్పత్తి చేసింది. ఫోర్డ్ వాహనాల్లో ఈ కారు అప్పట్లో మంచి విక్రయాలు అదుకుంది. ఫోర్డ్ పాపులర్, ఫోర్డ్ ఏంజిలియా మోడళ్లకు అప్ మార్కెట్ వర్షన్ అయిన వింటేజీ కారు ఫోర్డ్ ప్రిఫెక్ట్.

ఫోర్డ్ ప్రిఫెక్ట్ కారులో 1.2 లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండగా 3 స్పీడ్ మ్యానువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. లైట్ వెయిట్ స్ట్రక్చర్ తో రూపొందించిన ఈ వాహనం డ్యూరబుల్ మోటార్ ను కలిగి ఉంది. అంతేకాకుండా కంపెనీ హెడ్ క్వార్ట్ డెట్రాయిట్ లో కాకుండా బయట తయారు చేసిన తొలి ఫోర్డ్ కారు ఇదే కాగా దీన్ని ఎసెక్స్ లో ఉన్న డాగెన్ హామ్ వద్ద ఉత్పత్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ కార్లు 2 లక్షల యూనిట్లు అమ్ముడు పోగా అసలు ఇప్పుడు ఎన్ని వాడుకలో ఉన్నాయో కూడా ఊహించడం కష్టమే. అలాంటి అరుదైన వింటేజ్ కారును అమితాబ్ ఎంతగానో ఇష్టపడుతున్నారు.

Read: Bhima Jewelers Advertise: అబ్బాయి నుండి అమ్మాయిగా మారిన సున్నితకథ!