#GujaratElections: ఓట్లు వేయడానికి ఊరేగింపుగా వెళ్లిన 60 మంది కుటుంబ సభ్యులు

అమ్రేలీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేశ్ పన్సూరియాది ఉమ్మడి కుటుంబం. ఆయన కుటుంబంలో మొత్తం 60 మంది ఉన్నారు. నేడు గుజరాత్ అసెంబ్లీ మొదట దశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబంలోని 60 మంది కలిసి ఊరేగింపుగా వెళ్లి ఓట్లు వేశారు. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికో, ఏదైనా పార్టీలో చేరడానికో ఊరేగింపుగా వెళ్లే సంప్రదాయం మన దేశంలో ఉంది. అయితే, సురేశ్ కుటుంబంలోని 60 మంది ఓట్లు వేయడానికి ఊరేగింపుగా వెళ్లి వార్తల్లో నిలిచారు.

#GujaratElections: ఓట్లు వేయడానికి ఊరేగింపుగా వెళ్లిన 60 మంది కుటుంబ సభ్యులు

#GujaratElections: అమ్రేలీ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడు సురేశ్ పన్సూరియాది ఉమ్మడి కుటుంబం. ఆయన కుటుంబంలో మొత్తం 60 మంది ఉన్నారు. నేడు గుజరాత్ అసెంబ్లీ మొదట దశ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ కుటుంబంలోని 60 మంది కలిసి ఊరేగింపుగా వెళ్లి ఓట్లు వేశారు. సాధారణంగా ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్ వేయడానికో, ఏదైనా పార్టీలో చేరడానికో ఊరేగింపుగా వెళ్లే సంప్రదాయం మన దేశంలో ఉంది. అయితే, సురేశ్ కుటుంబంలోని 60 మంది ఓట్లు వేయడానికి ఊరేగింపుగా వెళ్లి వార్తల్లో నిలిచారు.

ఈ సందర్భంగా సురేశ్ మీడియాతో మాట్లాడుతూ… ‘‘మా ఉమ్మడి కుటుంబంలో మొత్తం 60 మందిమి ఉంటాం. ఇవాళ ఓటు వేయడానికి ఎవరికి వారు వెళ్లకుండా అందరమూ కలిసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అంతేకాదు, మేమందం కలిసి ఒకే రకం దుస్తులు ధరించి ఓట్లే వేయడానికి వచ్చాం. రాష్ట్రంలోని ఓటర్లు అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేయాలని సందేశాన్ని ఇవ్వడానికే ఇలా చేశాం’’ అని చెప్పారు.

సురేశ్ పన్సూరియా మేనకోడలు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాను వేరే ప్రాంతంలో చదువుకుంటున్నానని, ఓటు వేయడానికి సొంత సవరకుండ్లకు వచ్చానని చెప్పారు. తనతో పాటు తన కుటుంబంలోని ముగ్గురికి తొలిసారి ఓటు హక్కు వచ్చిందని తెలిపారు. ఎంతో ఉత్సాహంగా తామందరమూ వచ్చి ఓట్లే వేశామని అన్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..