Fish lorry: బోల్తాపడ్డ లారీ.. నిమిషాల్లో చేపలు మాయం..

ప్రపంచంలోని ప్రతి మనిషికి ఉచితంగా దొరికే వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ అధికశాతం మంది ప్రజలు ‘ఉచితం’ అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఉచితంగా లభించే వాటికోసం పోటీపడతారు. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్, చేపల లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు..

Fish lorry: బోల్తాపడ్డ లారీ.. నిమిషాల్లో చేపలు మాయం..

Fish Lorry

Fish lorry: ప్రపంచంలోని ప్రతి మనిషికి ఉచితంగా దొరికే వస్తువులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. భారత్ లోనూ అధికశాతం మంది ప్రజలు ‘ఉచితం’ అనే పదాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. ఉచితంగా లభించే వాటికోసం పోటీపడతారు. ఇదివరకు బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీలు, సెల్ ఫోన్స్, చేపల లోడ్ తో వెళ్తున్న వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు.. వాహనంలోని సురుకును స్థానిక ప్రజలు నిమిషాల్లో ఖాళీ చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. లారీపై నుండి పడిపోయిన చేపలను తీసుకెళ్లడానికి స్థానిక ప్రజలు పోటీపడ్డారు. ఫలితంగా లారీ పడిన కొద్దినిమిషాల్లోనే చేపలు మాయం కావటం గమనార్హం.

Leopard Attack: అర్ధరాత్రి పెంపుడు కుక్కపై చిరుత దాడి.. వీడియో వైరల్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బూర్గంపాడు మండలం ఐటీసీ క్రాస్ రోడ్డు వద్ద చేపల లారీ బోల్తా పడింది. ఏపీ నుంచి మహారాష్ట్రలోని నాగపూర్ వైపు వెళ్తున్న లారీ.. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి అదుపు తప్పి పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు గాయాలు కావటంతో చికిత్సనిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. లారీ బోల్తాకొట్టడంతో అందులోని చేపలన్నీ రోడ్డుపక్కకు పడిపోయాయి. అయితే కొద్ది నిమిషాల్లోనే ఇక్కడి చేపలు మాయమయ్యాయి.

MLA Raghunandan Rao: ఆ వీడియో బయటపెట్టినందుకు.. బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

చేపల లారీ పడిన విషయం చుట్టుపక్కల ప్రజలకు సమాచారం అందడంతో భారీగా తరలివచ్చి ఎవరికి దొరికిన చేపను వారు పట్టుకెళ్లారు. భారీగా స్థానికులు అక్కడికి చేరుకోవటంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి స్థానికులను కట్టడిచేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ఈ లారీలో సుమారు ఒక్కొక్కటి 2 కేజీల బరువు ఉన్న చేపలు నాలుగు వేల వరకు ఉన్నాయి. లారీ పడిన నిమిషాల వ్యవధిలోనే చేపలను స్థానికులు తీసుకెళ్లడం గమనార్హం.