ఆడపిల్ల పుడితే ఆ ఊరిలో పండుగే

ఆడపిల్ల పుడితే ఆ ఊరిలో పండుగే

An Telangana Village turns birth girls celebration : కడుపులో పెరుగుతున్న పిండం ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయించే ఈ రోజుల్లో ఆడపిల్ల పుట్టిందంటే ఊరు ఊరంతాం సంబరం చేసుకునే గ్రామం ఒకటుంది తెలుసా. అది తెలంగాణలోని ఉమ్మడి మెదక్ జిల్లాలో. ప్రస్తుతం అది సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం హరిదాస్పుర్ గ్రామం.

ఈ గ్రామంలో ఎవరి కుటుంబంలో అయినా ఆడపిల్ల పుట్టిందంటే ఊరు ఊరంతా పండుగలా జరపుకుంటున్నారు. ఈ విధానం గతేడాది 1 జనవరి 2020 నుంచి మొదలైంది. అప్పటి నుంచి ఊరిలో ఎవరి ఇంట్లోనైనా ఆడపిల్ల జన్మిస్తే.. ఊరంతా పండగ వాతావరణాన్ని తలపిస్తుంది. ఊరంచా లైట్లు ఏర్పాట్లు చేసి.. దుస్తులు, స్వీట్స్ పంచుకుంటారు.

పుట్టిన పాప పేరు మీద రూ. 1,000 ల చెక్కు అందజేస్తారు ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్. సుకన్య సమృద్ధి పథకం కింద వెయ్యి రూపాయల జమ చేస్తున్నారు ఆ ఊరి జనం. 10 ఏళ్లలోపు ఉన్న ఇద్దరు కూతుర్ల పేరుపై సుకన్య సమృద్ధి అంకౌంట్లను ప్రారంభించారు. ఆడపిల్లలను కడుపులోనే చంపేస్తున్న వారికి ఈ ఊరు ఆదర్శంగా నిలుస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు.