Anantapur: ఊరిచివర ఇసుక దిబ్బల్లో యువకుడి మృతదేహం.. కుక్కల అరుపులతో బయటపడింది!

కూలీలు పొలానికి వెళ్తుండగా ఇసుక దిబ్బల వద్ద కుక్కలు గుంపులుగా చేరి పెద్దగా అరుస్తున్నాయి. అనుమానమొచ్చిన ఆ కూలీలు కాస్త భయపడుతూనే ఆ ఇసుక దిబ్బల వద్దకు వెళ్లారు. వాళ్ళు భయపడినట్లుగానే ఇసుకలో నుండి ఒక మనిషి కాలు బయటకి కనిపిస్తుంది.

Anantapur: ఊరిచివర ఇసుక దిబ్బల్లో యువకుడి మృతదేహం.. కుక్కల అరుపులతో బయటపడింది!

Anantapur Young Man Dead Body Identified In Sand Dunes At The Anantapur

‌Anantapur: ఆ ఊరి వెంబడే ఓ వాగు ఉంది. సాధారణంగా ప్రతి ఏడాది వర్షాకాలంలో వరదతో పాటు ఆ వాగు ఒడ్డున ఇసుక దిబ్బలు ఏర్పడతాయి. ప్రతి రోజు ఆ ఇసుక దిబ్బల వైపునే కూలీలు, రైతులు పొలాలలో పనులకు వెళ్తుంటారు. గురువారం ఉదయం కూలీలు అలాగే పొలానికి వెళ్తుండగా ఇసుక దిబ్బల వద్ద కుక్కలు గుంపులుగా చేరి పెద్దగా అరుస్తున్నాయి. అనుమానమొచ్చిన ఆ కూలీలు కాస్త భయపడుతూనే ఆ ఇసుక దిబ్బల వద్దకు వెళ్లారు. వాళ్ళు భయపడినట్లుగానే ఇసుకలో నుండి ఒక మనిషి కాలు బయటకి కనిపిస్తుంది.

ఇసుకలో మృతదేహాన్ని చూసే కుక్కలు అరుస్తున్నాయని నిర్ణయించుకున్న ఆ కూలీలు ఊళ్ళో వాళ్ళతో కలిసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థానానికి వచ్చిన పోలీసులు ఆ మృతదేహాన్ని వెలికితీసి మృతిని వివరాల కోసం ఆరా తీశారు. జీన్స్, షర్ట్ ధరించిన యువకుడి జేబులో పర్స్ దొరకగా అందులో అందులో డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో దొరికింది. వాటి ఆధారంగా చనిపోయిన యువకుడు గుంతకల్లు మండలం, తిమ్మాపురం గ్రామానికి చెందిన 25 ఏళ్ల యువకుడు బోయ రాముడిగా కనుగొన్నారు.

మృతదేహాన్ని బట్టి ఆ యువకుడు చనిపోయి దాదాపుగా ఇరవై రోజులు గడిచి ఉంటుందని భావిస్తున్న పోలీసులు ఎవరో చంపి మృతదేహాన్ని అక్కడ పాతిపెట్టినట్లుగా భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపించి తిమ్మాపురం గ్రామానికి సమాచారమిచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మరణం వెనుక కారణాలను వెతికే పనిలో పడ్డారు. ముఖ్యంగా స్నేహితులతో గొడవ కారణంగా జరిగిన హత్యనా.. అక్రమ సంబంధాల వలన జరిగిన హత్యనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.