Anchor Anasuya: మరో ఐటెం సాంగ్.. ఈసారి అంతకు మించి?

హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా బుల్లి తెరపై హవా చూపిస్తున్న అనసూయ.. అడపాదడపా సినిమాలతో పాటు ఛాన్స్ దొరికితే ప్రత్యేక గీతాలతో అలరించేందుకు కూడా సిద్దమవుతుంది. రంగస్థలంలో రంగమ్మత్త...

Anchor Anasuya: మరో ఐటెం సాంగ్.. ఈసారి అంతకు మించి?
ad

Anchor Anasuya: హాట్ అండ్ బోల్డ్ యాంకర్ గా బుల్లి తెరపై హవా చూపిస్తున్న అనసూయ.. అడపాదడపా సినిమాలతో పాటు ఛాన్స్ దొరికితే ప్రత్యేక గీతాలతో అలరించేందుకు కూడా సిద్దమవుతుంది. రంగస్థలంలో రంగమ్మత్త లాంటి పాత్రలతో పాటు కాస్త వైవిధ్యంగా ఉండే పాత్రలకు కూడా సిద్ధపడుతున్న అనసూయ అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ లో దుమ్మురేపుతోంది. సాయిధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో సూయ సూయ అనసూయ సాంగ్ తో ఆకట్టుకున్న ఈ హాట్ యాంకర్ ఈ తరహా పాటలతో బాగానే గిట్టుబాటు అవుతుండడంతో మళ్ళీ మళ్ళీ ఒకే చెప్తుంది.

Samantha: నెగటివ్ పబ్లిసిటీ ఎంత ఉన్నా.. మరింత స్ట్రాంగ్‌గా సామ్!

ఆ మధ్య కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన `చావు కబురు చల్లగా`సినిమాలో పైన పటారం అంటూ చిందులేసింది. కాగా ఇప్పుడు మరోసారి ప్రత్యేక గీతంతో వచ్చేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. మాస్ మహా రాజా రవితేజ నక్కిన త్రినాధ్ రావ్ దర్శకత్వంలో ఓ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తెరకెక్కనుంది. కాగా, ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో అనసూయ స్టెప్పులేయనుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే అనసూయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.

Varudu Kaavalenu: దిగుదిగు నాగ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌లో ఓ సెన్సేషన్!

ఈ వార్తపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు కానీ.. ఈ పాటలో చిందులేసేందుకు అనసూయ గట్టిగానే ఛార్జ్ చేసిందని చెప్తున్నారు. ఇక, అనసూయ సినిమాల విషయానికి వస్తే త్వరలోనే రానున్న రవితేజ ఖిలాడీతో పాటు మెగా హీరోల ఆచార్య, పుష్ప సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తుంది. ఇవి కాకుండా మలయాళంలో ఎంట్రీ ఇస్తున్న అనసూయ తెలుగులో రంగ మార్తాండ అనే మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.