Updated On - 2:39 pm, Mon, 22 February 21
Anchor Anasuya: తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా గుర్తింపు పొందిన అనసూయ క్యారెక్టర్ నచ్చితే వెండితెరపై కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇటీవలే ‘థ్యాంక్ యు బ్రదర్!’ అనే డిఫరెంట్ మూవీ కంప్లీట్ చేసింది. ఈ సినిమాలో అనసూయ గర్భవతి గా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేసింది.
కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘చావు కబురు చల్లగా’ లో ఓ స్పెషల్ సాంగ్ చేసింది. అలాగే మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ‘ఖిలాడి’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. వీటితో పాటు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది అనసూయ. వెర్సటైల్ యాక్టర్, ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి సినిమాతో అనసూయ తమిళ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.
ఇప్పుడు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టితో నటించే అవకాశం వచ్చింది ఈ స్టార్ యాంకర్‌కి.. మమ్ముట్టి నటిస్తున్న ‘భీష్మ పర్వం’ సినిమాలో ఓ ముఖ్య పాత్రకు అనసూయను ఫిక్స్ చేశారట. కాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా వచ్చిన ‘యాత్ర’ సినిమాలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించగా అనసూయ కూడా ఓ కీలక పాత్రలో మెప్పించింది.
ఈ మూవీలో అనసూయ నటన చూసి ఇంప్రెస్ అయిన దర్శకుడు అమల్ నీరద్ ‘భీష్మ పర్వం’ సినిమాలోని ఓ పాత్రకు ఆమె అయితేనే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందని ఎంపిక చేశారట. ఈ మూవీతో మాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తోంది అనసూయ.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘యాత్ర’ లో మమ్ముట్టి గారితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాను.. మళ్లీ ఆయనతో కలిసి నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది.. నా క్యారెక్టర్ కోసం మలయాళం నేర్చుకుంటున్నాను.. ఏప్రిల్ నుండి ‘భీష్మ పర్వం’ సినిమాకి సంబంధించిన వర్క్ షాప్‌లో పాల్గొంటున్నాను’’ అన్నారు.
Aha : ఆహా సమర్పణలో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగ చైతన్య..
Nagababu : అల్లుడికి పండుగ గిఫ్టు ఇచ్చిన నాగబాబు
Thank You Brother : ఏప్రిల్ 30న అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్!’.. రిలీజ్ పోస్టర్ లాంచ్ చేసిన నాగ చైతన్య..
Tollywood Corona: టాలీవుడ్‌ను పట్టిపీడిస్తున్న కరోనా రాకాసి.. ఆ 2 సినిమాలు కూడా
tollywood : సినీ పరిశ్రమకు ఏపీ సర్కార్ శుభవార్త..ప్రత్యేక రాయితీలు, కృతజ్ఞతలు చెప్పిన మెగాస్టార్
Chiranjeevi : మెగాస్టార్ వరల్డ్ రికార్డ్.. అత్యధిక టికెట్లు అమ్ముడైన ఏకైక తెలుగు సినిమా ఇదే..