Andhra-Odisha Boarder: సరిహద్దు బంద్.. రోడ్డునే తవ్వేసిన అధికారులు!

కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండగా ఆయా ప్రభుత్వాలు కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నాయి.

Andhra-Odisha Boarder: సరిహద్దు బంద్.. రోడ్డునే తవ్వేసిన అధికారులు!

Andhra Odisha Boarder

Andhra-Odisha Boarder: కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉండగా ఆయా ప్రభుత్వాలు కట్టడికి ముమ్మర చర్యలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్ డౌన్ విధించగా మరికొన్ని రాష్ట్రాలు పాక్షిక లాక్ డౌన్ విధిస్తున్నాయి. అయితే.. రాష్ట్రాల మధ్య రాకపోకల కొనసాగింపుతో వైరస్ వ్యాప్తి తీవ్రమవుతుంది. అందుకే పలు రాష్ట్రాల సరిహద్దులలో ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. ఏపీలో రోజుకు ఇరవై వేలకు చేరువలో అధికారికంగా కేసులు నమోదవుతున్నాయి.

Andhra Odisha Boarder

Andhra Odisha Boarder

దీంతో పొరుగు రాష్ట్రాలు ఏపీ నుండి రాకపోకలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏపీతో సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, తెలంగాణలో ఒడిశా, కర్ణాటకలో లాక్ డౌన్ ఇప్పటికే అమలవుతుండగా తమిళనాడులో త్వరలోనే సంపూర్ణ లాక్ డౌన్ మొదలుకానుంది. కాగా ఒడిశా ప్రభుత్వం అధికారికంగానే ఏపీ నుండి రాకపోకలపై నిషేధం విధించింది. అందుకు గాను సరిహద్దులో చెక్ పోస్టులతో పాటు రెండు రాష్ట్రాల మధ్య రోడ్డు సంబంధాలను తెంపేసింది. రోడ్డును జేసీబీ యంత్రాలతో తవ్వించేసి వాహనాల రాకపోకల నిషేధం విధించింది.

Andhra Odisha Boarder

Andhra Odisha Boarder

శ్రీకాకుళం జిల్లాలో కరోనా వ్యాప్తి ఉదృతంగా ఉన్న నేపథ్యంలో ఆంధ్ర-ఒరిస్సా సరిహద్దు గ్రామాల్లో ఒడిశా అధికారులు రోడ్లు తవ్వేసి తమ రాష్ట్రానికి రావద్దని కఠినంగా హెచ్చరించారు. మెళియాపుట్టి – ఒరిస్సా సరిహద్దు గ్రామాలైన బిన్నాల, అగర్ఖండిలలో అధికారులు దగ్గరుండి మరీ జేసీబీలతో రోడ్లు తవ్వించి సంబంధాలను తెంపేశారు. ఆంక్షలు అతిక్రమించి తమ రాష్ట్రంలోకి వచ్చే వారిపై కఠినంగా వ్యహరిస్తామని హెచ్చరిస్తున్నారు. లాక్ డౌన్ ముగిసేవరకు శ్రీకాకుళం జిల్లా నుండి తమ రాష్ట్రంలోకి వచ్చేవారికి తీవ్ర ఆంక్షలు విధిస్తున్నారు.

Read: East Godavari: గుంపులుగా గుంపులుగా ప్రజలు.. ఆందోళన కలిగిస్తున్న వ్యాక్సినేషన్!