పేదోడికి సాయం : ఏపీలో నాలుగో విడత రేషన్

  • Published By: madhu ,Published On : May 16, 2020 / 05:29 AM IST
పేదోడికి సాయం : ఏపీలో నాలుగో విడత రేషన్

పేదలకు నాలుగో విడత రేషన్ సాయాన్ని ఏపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. సీఎం జగన్ ఆదేశాలతో 2020, మే 16వ తేదీ శనివారం ఉదయం..06 గంటలకు ప్రారంభించారు. 2020, మే 27వ తేదీ వరకు సరుకులు పంపిణీ చేయనున్నారు. మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, ఒక కిలో శనగలు ఇస్తున్నారు.

రాష్ట్రంలో 28 వేల 354 రేషష్ షాపుల ద్వారా సరుకుల పంపిణీ చేస్తున్నారు. మొత్తం 1, 48, 05, 879 కుటుంబాలు లబ్ది పొందనున్నాయని అంచనా. 1, 47, 24, 017 బియ్యం కార్డులున్నాయి. కార్డు దారులకు తప్పనిసరిగా..బయోమెట్రిక్ తప్పని సరి చేశారు. రేషన్ షాపుల వద్ద తప్పనిసరిగా శానిటైజర్ అందుబాటులో ఉంచాలి. చేతులకు రాసుకున్న తర్వాతే..సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. మాస్క్ తప్పనిసరి. 

తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబసభ్యుడికి ఐదు కిలోల ఉచిత బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డు ఉన్న వారికి 35 కిలోల బియ్యం, అన్నపూర్ణ కార్డు దారులకు 10 కిలోల ఉచిత బియ్యం, ప్రతి కార్డు దారుడికి కిలో శనగపప్పు ఇస్తున్నారు. 

రేషన్ తీసుకొనేందుకు నిబంధనలు విధించింది. దుకాణాల వారీగా..టైం స్లాట్ కూపన్లు ఇచ్చారు. కూపన్ లో సూచించిన తేదీల్లో లబ్దిదారులు రేషన్ కు రావాలని అధికారులు సూచించారు. లబ్దిదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. 

Read Here>> వైఎస్‌ఆర్‌ రైతుభరోసా – పిఎం కిసాన్‌ : రైతుల ఖాతాల్లో నగదు జమ