Andhra Pradesh : పరిషత్ ఎన్నికల పోలింగ్, ఫలితాలు అప్పుడే వెల్లడించరు

Andhra Pradesh : పరిషత్ ఎన్నికల పోలింగ్, ఫలితాలు అప్పుడే వెల్లడించరు

Ap Parishad

Mandal, Zila Parishad Election 2021 : ఏపీలో పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించుకోవచ్చని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ తీర్పు ఇవ్వడంతో.. ఎన్నికలు యధావిధిగా జరుగుతున్నాయి. ఫలితాలను మాత్రం అప్పుడే వెల్లడించవద్దని ఆదేశాలిచ్చింది న్యాయస్థానం.

515 జడ్పీటీసీ, 7 వేల 220 ఎంపీటీసీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. జడ్పీటీసీ స్థానాల్లో 2 వేల 58 మంది, ఎంపీటీసీ స్థానాల్లో 18 వేల 782 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 126 జడ్పీటీసీలు, 2 వేల 371 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్రంలోని 2 కోట్ల 46 లక్షల 71 వేల 2 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పరిషత్‌ ఎన్నికల కోసం 27 వేల 751 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా.. వీటిలో 6 వేల 492 సమస్యాత్మక, 6 వేల 314 అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించారు అధికారులు. ఎన్నికల విధుల్లో లక్షా 71 వేల 44 మంది సిబ్బంది పాల్గొననున్నారు.

ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్‌ జరగనుంది. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇప్పటికే అలర్ట్‌ అయ్యారు. అల్లర్లు, ఘర్షణలు జరగకుండా భారీగా పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. మరోవైపు ఎన్నికలపై హైకోర్టు తీర్పును సవాల్‌ చేయనుంది టీడీపీ. ఎన్నికలపై సుప్రీం కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

Read More :PM Modi : వాట్ నెక్ట్స్, రాష్ట్రాల సీఎంలతో మోడీ వీడియో కాన్ఫరెన్స్