andhra pradesh : తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా చంపిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించిన ప్రొద్దుటూర్ కోర్టు

న్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.

andhra pradesh : తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా చంపిన కిరాతకుడికి ఉరిశిక్ష విధించిన ప్రొద్దుటూర్ కోర్టు

proddatur court sentences man to death for killing his mother, brother and pregnant sister

andhra pradesh :కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లి, తమ్ముడిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితుడు కరీముల్లాకు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు జిల్లా కోర్ట్ ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. 2021లో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా వున్న హైదర్‌ఖాన్ వీధిలో వుంటున్న తన తల్లి గుల్జార్ బేగం, సోదరి కరీమున్నీసా, సోదరుడు మహమ్మద్ రఫీలను కరీముల్లా అత్యంత కిరాతకంగా చంపేశాడు. హత్యకు గురయ్యే నాటికి అతని సోదరి కరీమున్నీసా ఆరు నెలల గర్భిణీ. అయినా సైకోగా మారిన కరీంముల్లా ఆమెను కూడా వద్దల్లేదు.

ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న హైదర్‌ఖాన్‌ వీధిలో గుల్జార్‌బేగం (51), కరీమున్నీసా(27), మహమ్మద్‌రఫి (23) దారుణ హత్యకు గురయ్యారు. బొంగుబజార్‌లో మెకానిక్‌గా పని చేసే చాంద్‌బాషా ప్రొద్దుటూరులోని హైదర్‌ఖాన్‌ వీధిలో నివాసం ఉంటున్నాడు. అతనికి భార్య గుల్జార్‌బేగం, కరీముల్లా, మహబూబ్‌బాషా, మహమ్మద్‌రఫి అనే కొడుకులు, కరీమున్నీసా అనే కూతురు ఉన్నారు. మహ్మద్‌రఫి తండ్రితో పాటు పని చేస్తుండేవాడు. మిగతా ఇద్దరూ బీరువాల తయారు చేస్తుండేవారు. వీళ్లిద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి.

మహబూబ్‌బాషా తల్లిదండ్రులు ఉంటున్న ఇంటిపైనే అద్దెకు ఉంటున్నాడు. కరీముల్లా మాత్రం తల్లిదండ్రుల వద్ద ఉండేవాడు. కూతురు కరీమున్నీసాకు భగత్‌సింగ్‌ కాలనీకి చెందిన రహిముల్లాతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. కరీముల్లా కొన్ని రోజులుగా కుటుంబాన్ని పట్టించుకుండా ఇష్టానురీతిగా ఉండేవాడు. కుటుంబ ఖర్చులకు డబ్బు కూడా సరిగా ఇచ్చేవాడు కాదు. దీంతో తల్లిదండ్రులు మందలించారు. బాధ్యతగా ఉండాలని చెబుతుండేవారు. ఈ క్రమంలో ఏడాది క్రితం హైదర్‌ఖాన్‌ వీధి పక్కనే ఉన్న మరో వీధిలో కరీముల్లాతో వేరు కాపురం పెట్టించారు. వారికి ఒక కూతురు ఉంది.

వేరుకాపురం పెట్టినప్పటినుంచి గొడవలు మొదలయ్యాయి.ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఒక రోజు భార్యను నిలదీశాడు. దానికామె మీ అమ్మానాన్నలకు మనం కలిసి ఉండటం ఇష్టంలేక నాపై నిందలు వేస్తున్నారంటూ మండిపడింది. ఆ రోజు నుంచి తల్లిదండ్రులతో గొడవ పడుతుండేవాడు. అటు భార్యపై అనుమానం, ఇటు తల్లిదండ్రులపై కోపం అతన్ని రాక్షసుడిగా మార్చాయి.

తనకు సుఖం లేనప్పుడు ఇంట్లో ఎవ్వరినీ బతకనీయనంటూ కరీముల్లా అంటుండేవాడు. కోపంతోనే అనేవాడని అతని మాటలను కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.చెప్పినట్లు గానే తల్లి,చెల్లి, తమ్ముడిని దారుణంగా చంపేశాడు కరీంముల్లా. దీంతో పోలీసులు అరెస్ట్ చేయటం కోర్టు విచారణ చేసిన క్రమంలో సైకో కరీముల్లాకు ప్రొద్దుటూరు కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.

అమ్మను,తమ్ముడిని, చెల్లెల్ని దారుణంగా చంపినవాడు నాకు కొడుకు కాదు రాక్షసుడు. వాడిని వాడిని ఉరి తీయండి..ఇటువంటి కిరాతకుడు ఈ భూమ్మీద ఉండకూడదు ఉరి తీయండీ సార్ అంటూ తండ్రి చాంద్‌బాషా ఎంతగానో రోదించాడు. పుట్టింటికొచ్చిన గర్భిణీగా ఉన్న నా కూతురుని పొట్టనపెట్టుకున్నాడు. వాడు ఓ తోడబుట్టివాడా? తన భార్యను పంపించమంటూ నా అల్లుడు రహీముల్లా వచ్చిన అడిగితే రెండు రోజులుండి వస్తుందిలే అని చెప్పి పంపించాను..ఇంతలోనే తోడబుట్టివాడి చేతిలో కడుపులో బిడ్డతో సహా ప్రాణాలు కోల్పోయింది సార్ నాకూతురు అంటూ చాంద్ భాషా ఏడుస్తుంటే చూసేవారంత కంటతడి పెట్టకుండా ఉండలేకపోయారు. ఏ పాపం చేసిందని నా భార్యను చంపాడు.. కన్నతల్లినే కర్కశంగా చంపినా ఆ నాకొడుకుని ఉరితీయండీ సార్ అంటూ చాంద్ భాషా కన్నీరుమున్నీరుగా విలపించాడు.