Weather Update: ముంచుకొచ్చిన వాయు’గుండం’.. నేడు తీరందాటే అవకాశం

దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు...

Weather Update: ముంచుకొచ్చిన వాయు’గుండం’.. నేడు తీరందాటే అవకాశం

Weather Update: దక్షణాది రాష్ట్రాలను వరుణ గండం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే తమిళనాడు, ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురవగా.. తుఫాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతం దాని సరిహద్దుల్లో ఏర్పడిన అల్పపీడనం గురువారం ఉదయం 8.30 గంటలకు వాయుగుండంగా మారింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన దీని ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాలలో కుండపోత వర్షాలు కురుస్తుండగా తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి.

TTD Accommodation : తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు టీటీడీ వసతి ఏర్పాటు

కాగా, ఈ వాయుగుండం శుక్రవారం చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం, విపత్తు నిర్వహణశాఖ కమిషనర్‌ కన్నబాబు తెలిపారు. ‘గురువారం రాత్రి వరకు చెన్నైకి ఆగ్నేయంగా, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా, కరైకాల్‌కు తూర్పు ఈశాన్యంగా కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం.. శుక్రవారం వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌-ఉత్తర తమిళనాడు వద్ద చెన్నైకి సమీపంలో తీరం దాటే అవకాశముందని తెలిపారు.

Tirupati : అంధకారంలో తిరుపతి ?, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు!

ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తుండగా పలు లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో ఒక మోస్తరు వానలు కురవనున్నాయని చెప్పారు.