Anil Ravipudi: మోక్షజ్ఞ ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ!

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్’గా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలవడంతో.....

Anil Ravipudi: మోక్షజ్ఞ ఎంట్రీపై అనిల్ రావిపూడి క్లారిటీ!

Anil Ravipudi Clarity On Nandamuri Mokshagnya Entry

Anil Ravipudi: టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్’గా మారిపోయాడు. ఆయన తెరకెక్కించిన అన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలవడంతో, ఆయన డైరెక్షన్‌లో సినిమా చేసేందుకు స్టార్ హీరోలు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. ఇక ఈ డైరెక్టర్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్3’ బాక్సాఫీస్ వద్ద నవ్వుల పూవులు పూయిస్తూ సందడి చేస్తోంది. ఈ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వరుసగా వేసుకున్నాడు ఈ డైరెక్టర్. ఇక అనిల్ రావిపూడి ఎఫ్3 సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తరుణంలో వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తూ బిజీగా ఉన్నాడు.

Anil Ravipudi: ఆగలేనంటోన్న అనిల్.. బాలయ్యదే లేటు!

ఈ క్రమంలోనే అనిల్ రావిపూడి తన నెక్ట్స్ ప్రాజెక్టు గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. తన నెక్ట్స్ మూవీని నటసింహం నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సినిమాను తన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉండబోతున్నట్లు వెల్లడించాడు. అంతేగాక బాలయ్యను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించబోతున్నట్లు ఆయన అన్నారు. అయితే గతకొంత కాలంగా నందమూరి నటవారసుడిగా మోక్షజ్ఞ ఎంట్రీ కూడా అనిల్ రావిపూడి సినిమాతో ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయంపై అనిల్ క్లారిటీ ఇచ్చేశాడు.

Anil Ravipudi: అనిల్ దర్శకత్వంలో బాలయ్య మల్టీస్టారర్ సినిమా.. క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్!

తాను చేయబోయే సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ లేదని.. కేవలం బాలయ్యను దృష్టిలో పెట్టుకొనే తాను స్క్రిప్టు రెడీ చేశానని.. ఈ సినిమా నందమూరి అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని.. వారు ఈ సినిమాలో సరికొత్త బాలయ్యను చూస్తారని అనిల్ ధీమా వ్యక్తం చేశాడు. అంటే.. ఇంతకాలం సోషల్ మీడియాలో, ఫిలిం వర్గాల్లో వినిపిస్తున్న వార్తలకు అనిల్ రావిపూడి చెక్ పెట్టినట్లుగా అయ్యింది. నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ తన డైరెక్షన్‌లో లేదని క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు మళ్లీ మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ అయోమయంలో పడిపోయింది. మరి ఈ విషయంపై బాలకృష్ణ ఏదైనా క్లారిటీ ఇస్తారా అని నందమూరి అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.