కోవాగ్జిన్ ఇచ్చాక.. మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్

  • Published By: sreehari ,Published On : December 5, 2020 / 02:14 PM IST
కోవాగ్జిన్ ఇచ్చాక.. మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్

Anil Vij tests Covid-19 positive : హర్యానా ఆరోగ్య మంత్రి, బీజేపీ నేత అనిల్ విజ్ COVID-19 కు పాజిటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 20న, మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా, కోవిక్సిన్ వ్యాక్సిన్‌ను ఆయనకు ఇచ్చారు.



వ్యాక్సినేషన్ అనంతరం కరోనా పాజిటివ్‌ అని తేలింది. సివిల్ హాస్పిటల్ అంబాలా కాంట్లో చేరాను. నాతో సన్నిహితంగా ఉన్న వారందరూ కరోనా టెస్టు చేయించుకోవాలని సూచించారు.



కోవాక్సిన్ కోసం మూడవ దశ ట్రయల్స్‌లో మొదటి స్వచ్చంద వాలంటీర్‌గా హర్యానా మంత్రి ముందుకొచ్చారు.



గత నెలలో అంబాలా కాంట్‌లోని సివిల్ ఆస్పత్రిలో ట్రయల్ డోస్ ఇచ్చారు. కోవాక్సిన్ కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను భారతీయ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR)తో పాటు భారత్ బయోటెక్ స్వదేశీగా అభివృద్ధి చేస్తోంది.