ఆన్‌లైన్‌లో గొర్రెలు, మేకల అమ్మకాలు : దటీజ్ కరోనా బిజినెస్ ట్రెండ్

  • Published By: nagamani ,Published On : July 6, 2020 / 02:03 PM IST
ఆన్‌లైన్‌లో గొర్రెలు, మేకల అమ్మకాలు : దటీజ్ కరోనా బిజినెస్ ట్రెండ్

వస్తువు ఉన్నచోటికే కొనుగోలుదారులు రావాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ మార్కెట్లు హల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కరోనా తోడు కావడంతో బయటకు వెళ్లకుండానే చాలా మంది అన్నీ ఆన్ లైన్ లోనే కొనుక్కోవటం పరిపాటిగా మారిపోయింది. ఎలక్ట్రానిక్, ఫుడ్, బట్టలు..నిత్యావసర వస్తువులతో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ఆన్ లైన్ అమ్మాకాలలిస్ట్ లోకి జంతువులు కూడా చేరిపోయాయి. బక్రీదు పండుగ సందర్భంగా..ఆన్‌లైన్ ద్వారా గొర్రెలు, మేకలు అమ్మకాలు షురూ అయిపోయాయి.

అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీకి చెందిన ఐదుగురు ఓల్డ్ స్టూడెంట్స్  జంతువుల అమ్మకాల కోసం ప్రత్యేకించి ఓ వెబ్ సైట్ రూపొందించారు. ఈ ఏడాది జులై 31న బక్రీద్ పండగ నేపథ్యంలో మేకలు, గొర్రెలను ఆన్ లైన్ లోనే కొనుక్కోవచ్చు అంటూ.. Netlivestock.com లో ఆర్డర్ చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్న మేకను..లేదా గొర్రెలను మీ ఇంటికి పంపిస్తామంటున్నారు. కరోనా మహమ్మారి కాలంలో ఈ ఆన్ లైన్ యానిమల్ మార్కెట్‌కు వెళ్లేందుకు భయపడుతున్న క్రమంలో ఈ కొత్త పద్ధతిని రూపొందించామని అలీఘడ్ ముస్లిం యూనివర్శిటీ అలూమ్నీ వెబ్ సైట్ సభ్యుడు ఖలీదా రాజా తెలిపారు.

ఈ సందర్భంగా ఖలీదా రాజా మాట్లాడుతూ..కోవిడ్-19తో ప్రజలు జంతుమార్కెట్ కు రావటానికి భయపడుతున్నారనీ..దీంతో ఈ ఆన్ లైన్ మార్కెట్ ను రూపొందించామని తెలిపారు. మరో సభ్యుడు మసూద్ ఉల్ హాసన్ మాట్లాడుతూ..బక్రీదు పండుగ సందర్భంగా మొరాబాద్ డివిజన్ లోని జంతు మార్కెట్ లో ప్రత్యేకంగా ఢిల్లీ..ముంబై వంటి పలు ప్రాంతాల నుంచి మేకలను..గొర్రెలను అమ్ముతుంటారు. కానీ లాక్ డౌన్ వల్ల ఈ మార్కెట్ పెద్దగా కొనుగోలు జరిగే అవకాశం లేదు. దీంతోఈ ఆన్ లైన్ ద్వారా జంతువులను అమ్మేలా ప్లాన్ చేశామని అన్నారు.
పైగా దీంట్లో దళారీల ప్రసక్తే ఉండదు కాబట్టి ఈ వెబ్ సైట్ ద్వారా అమ్మేవారికి..కొనేవారికి ఎటువంటి ఇబ్బందీ ఉండదని ఇది రైతులకు బాగా ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ వెబ్ సైట్ లో అమ్మే జంతువులకు సంబంధించి అన్ని వివరాలు ఉంటాయని..వాటి బరువు..వయస్సు..కొమ్ములు, చెవుల కొలతలు…వాటి పళ్లు ఎలా ఉన్నాయి వంటి అన్ని వివరాలు ఉంటాయని తెలిపారు. ఈ ఆన్ లైన్ మార్కెట్ ద్వారా ద్వారా రైతులు, వినియోగదారులను అనుసంధానం చేస్తూ విక్రయలు జరపనున్నట్టు చెప్పారు. మొత్తానికి కరోనా పుణ్యమా అని ఇప్పుడు గొర్రెలు, మేకలు కూడా ఆన్‌లైన్‌లో లభిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Read Here>>మహిళ పొట్టపై ఎన్ని తేనేటీగలో చూశారా…