Hi-Tech Auto : అన్నా దురై హైటెక్ ఆటో…ఆదర్శంగా ఆటోవాల

తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారో ఆ సదుపాయాలన్నింటిని ఆటోలో కల్పించాలని నిర్ణయించుకున్నాడు.

Hi-Tech Auto : అన్నా దురై హైటెక్ ఆటో…ఆదర్శంగా ఆటోవాల

Untitled Design

Hi-Tech Auto : తమిళనాడులో అన్నా దొరై అంటే తెలియని వారుండరు. ఇటీవలి కాలంలో అతను అంతపాపులర్ అయ్యాడు. ఇంతకీ అతనేమి సినిమాస్టార్ కాదు..రాజకీయ నాయకుడు అంతకన్నాకాదు…సామాన్యమైన ఆటోవాల…ఒక ఆటోనడుపుకునే వ్యక్తి ఎందుకింతపాపులరయ్యాడంటే అతను అనుసరించిన హైటెక్ విధానాలే కారణం. తన ఆటోలో ప్రయాణికులకోసం ఏర్పాటు చేసిన సౌకర్యాలు అతడికి హైటెక్ ఆటోవాలగా పేరు తెచ్చిపెట్టాయి. ఇక వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని చెన్నై నగరానికి చెందిన అన్నా దొరై చిన్ననాటి నుండే ఎన్నో కలలు కన్నాడు. బాగా చదువుకొని పెద్ద వ్యాపార వేత్తగా ఎదగాలనుకున్నాడు. అయితే కుంటుంబ ఆర్ధిక పరిస్ధితులు అతనికి ఏమాత్రం సహకరించలేదు. తండ్రి ఆటో డ్రైవర్ కావటంతో వచ్చే సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోయేవి. దీంతో అతని చదువు పూర్తిస్ధాయిలో సాగలేదు. మధ్యలోనే చదువుకు స్వస్తిపలికి ఆటో డ్రైవర్ గా అవతారమెత్తాడు.

తన ఆటోలో ఎక్కే ప్రయాణికులు ఏం కోరుకుంటున్నారో ఆ సదుపాయాలన్నింటిని ఆటోలో కల్పించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఆటోలో ప్రయాణికులకోసం ఓ చిన్న ఫ్రిజ్ ను ఏర్పాటు చేసి ఆహారపదార్ధాలు, వాటర్ ను ఉంచేవాడు, ప్రతిరోజు 6 న్యూస్ పేపర్లు అందుబాలులో ఉంచేవాడు. వివిధ రాష్ట్రాల నుండి వచ్చే ప్రయాణికులకు అవసరమైన పలు భాషల మ్యాగ్జైన్లు, డబ్బులు చెల్లించేందుకు స్వైపింగ్ మిషన్, నెట్ బ్రౌజింగ్ కోసం అవసరమైన ట్యాబ్, ఫ్రంట్ లో న్యూస్ గురించి తెలుసుకునేందుకు ఓ చిన్న టీవి, ఫోన్ ఛార్జింగ్ పాయింట్ వంటి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాడు.

9భాషల్లో తన ఆటో ఎక్కే ప్రయాణికులను పలకరించగలిన అన్నా దొరై ఇంగ్లీష్ లో ధారాళంగా మాట్లాడగలడు. ఆటో ఎక్కేవారిని సౌకర్యవంతంగా తమ గమ్యస్ధానాలకు చేర్చేవాడు. ఆటో డ్రైవర్ అంటే అదేదో బ్రతుకు దెరువు కోసం అన్నట్టు కాకుండా సరదాగా ఇదో హోందాగా ఉండే వ్యాపారంలా భావిస్తున్నాని అన్నా దొరై చెప్తున్నాడు. అన్నా దొరై ఆటోలో ఎక్కెందుకు చాలా మంది ప్రయాణికులు ఇష్టపడుతున్నారు. అంతేకాదు ఇతర ఆటో డ్రైవర్లు అన్నా దొరైను ఆదర్శంగా మారాడు. మనం ఏంచేస్తున్నామనేదికాదని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జీవించాలన్నదే అన్నా దొరై చెప్తుంటాడు. ప్రస్తుతం తమిళనాడు యువకులకు అతని మోటివేషనల్ స్పీచ్ లు ఎంతో స్పూర్తి దాయకంగా మారాయి.