Anniyan Remake: బాలీవుడ్ కెళ్తున్న అపరిచితుడు.. డైరెక్టర్ ఎవరంటే?

ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ కన్ను మన సౌత్ సినిమాల మీద పడింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలతో పాటు ఇంతకు ముందు చరిత్ర సృష్టించిన సినిమాలను కూడా ఇప్పుడు అక్కడ రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నియన్ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది.

Anniyan Remake: అపరిచితుడు సినిమా మన దగ్గర సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. రెమో, రామానుజం, అపరిచితుడుగా మూడు పాత్రలలో చియాన్ విక్రమ్ నటనకు దక్షణాది ప్రజలు ఫిదా అయిపోయారు. ఇండియన్ జేమ్స్ కేమరూన్ గా పేరున్న శంకర్ ఎంచుకునే కాన్సెప్ట్, తెరకెక్కించిన విధానం ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతుంటుంది. ఇప్పుడు టీవీలో వచ్చినా భారీ టీఆర్పీలు దక్కించుకునే ఈ సినిమా ఒరిజినల్ అన్నియన్ తమిళ్ సినిమా. తెలుగులో అపరిచితుడుగా డబ్బింగ్ చేయగా ఆ సినిమాతో విక్రమ్ తెలుగులో మార్కెట్ సొంతం చేసుకోగా.. హీరోయిన్ సదా బిజీ స్టార్ గా మారింది.

కాగా, ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మేకర్స్ కన్ను మన సౌత్ సినిమాల మీద పడింది. అంతకు ముందు నూటికో కోటికో ఒక సినిమాను రీమేక్ చేసే బాలీవుడ్ ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోల మీద స్పెషల్ ఫోకస్ పెట్టేసింది. కొత్తగా విడుదలయ్యే సినిమాలతో పాటు ఇంతకు ముందు చరిత్ర సృష్టించిన సినిమాలను కూడా ఇప్పుడు అక్కడ రీమేక్ చేసేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే అన్నియన్ సినిమాను రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తుంది. హీరో రణవీర్ సింగ్ ఈ ప్రాజెక్ట్ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తూ దర్శక, నిర్మాతలను రైట్స్ కోసం వాకబు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

రణవీర్ గత ఏడాది జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను రీమేక్ చేసి బంపర్ హిట్ కొట్టగా ప్రస్తుతం కపిల్ దేవ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన చిత్రం 83 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రణవీర్ ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉండగా తర్వాత సినిమాగా అపరిచితుడు రీమేక్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఒకవేళ రీమేక్ కన్ఫర్మ్ అయితే.. అక్కడ దర్శకుడు ఎవరన్నది ఆసక్తిగా మారింది. ఒరిజినల్ తెరకెక్కించిన శంకర్ ప్రస్తుతం భారతీయుడు-2 పనులలో బిజీగా ఉండగా అపరిచితుడు రీమేక్ డైరెక్ట్ చేస్తారా.. లేక బాలీవుడ్ దర్శకులలో మరెవరైనా ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

ట్రెండింగ్ వార్తలు