Tokyo Paralympics : టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. భారత అథ్లెట్స్ జోరు కొనసాగుతోంది. భారత్ కు మరో పతకం దక్కింది. ఇవాళ రజత పతకం రాగా.. తాజాగా మరో కాంస్య పతకం దక్కింది.

Avani Lekhara
Avani Lekhara wins bronze medal : టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. భారత అథ్లెట్స్ జోరు కొనసాగుతోంది. భారత్ కు మరో పతకం దక్కింది. ఇవాళ రజత పతకం రాగా.. తాజాగా మరో కాంస్య పతకం దక్కింది. మహిళ షూటర్ అవని లేఖారా ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకాన్ని గెలిచింది. మహిళల 50 మీటర్ల షూటింగ్ విభాగంలో అవని లేఖరాకు కాంస్య పతకం లభించింది.
ఇవాళ ఉదయం పురుషుల హైజంప్ లో భారత్ కు రజత పతకం లభించింది. పురుషుల హైజంప్ లో భారత క్రీడాకారుడు ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంపు చేసి రజత పతకాన్ని గెలించాడు. మొన్న హైజంప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ మరియప్పన్ తంగవేలు రజతం నెగ్గగా.. శరద్ కుమార్ కాంస్యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు ప్రవీణ్‌కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు.
దీంతో హైజంపులో భారత్ కు ఇది మూడో పతకం కాగా ఇంతకుముందు 3 రజత పతకాలు వచ్చాయి. దీంతో భారత్ కు మొత్తం 12 పతకాలు లభించాయి. ఇందులో 2 గోల్డ్ పతకాలు ఉండగా… 6 రజత పతకాలు, 4 కాంస్య పతకాలు ఉన్నాయి.
టోక్యోకు ముందు అన్ని పారాలింపిక్స్‌లో భారత్‌కు వచ్చిన పతకాలు మొత్తం 12. కానీ ఈసారి మనోళ్ల జోరు మామూలుగా లేదు. ఈ ఒక్క పారా క్రీడల్లోనే భారత్.. గత పారాలింపిక్స్ అన్నింటిలో కలిపి సాధించిన పతకాల కన్నా కూడా ఎక్కువగా గెలిచే దిశగా సాగుతోంది. అథ్లెట్ల స్ఫూర్తిదాయక ప్రదర్శన కొనసాగిన వేళ.. భారత్ పతకాల సంఖ్య అసాధారణ స్థాయిలో 12కి చేరుకుంది.