హీరో సుశాంత్ సింగ్ కుటుంబంలో మరో విషాదం

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి సుశాంత్

  • Published By: naveen ,Published On : June 16, 2020 / 05:04 AM IST
హీరో సుశాంత్ సింగ్ కుటుంబంలో మరో విషాదం

బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి సుశాంత్

ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ రాజ్ పుత్ సింగ్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఆ కుటుంబం మరో కుటుంబ సభ్యురాలిని కోల్పోయింది. సుశాంత్‌ ఆకస్మిక మృతిని తట్టుకోలేక అతడి వదిన(కసిన్‌ బ్రదర్‌ భార్య) బీహార్‌లోని పుర్నియాలో కన్నుమూసింది. సుశాంత్‌ మరణంచిన విషయాన్ని తట్టుకోలేని ఆమె.. అప్పటి నుంచి ఆహారం తీసుకోవడం మానేసింది. అప్పటివరకు టీవీలో అంత్యక్రియలను చూస్తూ కన్నీటి పర్యంతం అయిన ఆమె, అంత్యక్రియలు ముగిసిన కాసేపటికి అనారోగ్యానికి గురై కుప్పకూలింది. గంటల వ్యవధిలో రెండు ఆకస్మిక మరణాలు సుశాంత్ కుటుంబంలో తీవ్ర విషాదం నింపాయి.

సుశాంత్ ఆకస్మిక మరణం తట్టుకోలేక:
బీహార్‌లోని పుర్నియా జిల్లా లాల్ మల్డీహా గ్రామంలో సోమవారం(జూన్ 15,2020) అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ స్వగ్రామం ఇది. కృష్ణ కుమార్ సింగ్ కుటుంబం పాట్నాలో స్థిరపడింది. కృష్ణ కుమార్ సింగ్‌కు ఒక కొడుకు(సుశాంత్ సింగ్)‌, నలుగురు ఆడపిల్లలు. ఆయన సోదరుడు లాల్ మల్డీహా గ్రామంలోనే నివసిస్తున్నారు. సుశాంత్ భౌతికకాయానికి ముంబై విల్లే పార్లెలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో సోమవారం అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియలను కుటుంబసభ్యులు టీవీలో చూశారు. ఆ సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వార్త తెలిసినప్పటి నుంచి సుశాంత్ వదిన సుధాదేవి అన్నపానియాలు మానేసింది. దీంతో ఆమె అనారోగ్యానికి గురైంది. సోమవారం అర్ధరాత్రి లోబీపీతో బాధపడిందని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడిందని, అదే సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

తన నివాసంలో సూసైడ్:
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆదివారం(జూన్ 14,2020) ఉదయం బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. 34ఏళ్ల వయసులోనే ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు ఈ విధంగా అర్థాంతరంగా తనువు చాలించడం ఎవరూ తట్టుకోలేకపోతున్నారు. అద్భుతమైన నటుడు, గొప్ప సినిమాలు.. అంతా బాగానే ఉంది. సడన్‌గా ఇలా ఆత్మహత్య చేసుకోవడం అందరిలోనూ విషాదం నింపింది. సుశాంత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది మిస్టరీగా మారింది. పోస్టుమార్టం నివేదిక ప్రకారం సుశాంత్ ది ఆత్మహత్య అని పోలీసులు నిర్ధారించారు.

సుశాంత్‌ది ఆత్మహత్య కాదు హత్య:
అయితే సుశాంత్ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. దీని వెనుక కుట్ర ఉందని, సీబీఐ దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. సుశాంత్ ది ప్లాన్డ్ మర్డర్ అని, బాలీవుడ్ పెద్దలే హత్య చేశారని బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కాగా, సుశాంత్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మహారాష్ట్ర హోంశాఖ మంత్రి దేశ్‌ముఖ్ తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పిన ఘటనలపై ఆరా తీస్తామన్నారు. సుశాంత్ మీద ఎవరైనా ఉద్దేశపూరకంగా మానసిక ఒత్తిడి తీసుకొచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపడతామన్నారు. సుశాంత్‌ మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని.. ఒత్తిడికి అతడు మందులు వాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.