Anthony Fauci: డెల్టా వేరియంట్ అమెరికాకు సవాలే: డాక్టర్ ఫౌచీ

కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనభై దేశాలకు పైగా విస్తరించిన డెల్టావేరియంట్ నుండి ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మన దేశంలో కూడా సెకండ్ వేవ్ లో దండెత్తిన ఈ వేరియంట్ సృష్టించిన మరణ మృదంగం అంతా ఇంతా కాదు.

Anthony Fauci: డెల్టా వేరియంట్ అమెరికాకు సవాలే: డాక్టర్ ఫౌచీ

Anthony Fauci

Anthony Fauci: కరోనా డెల్టా వేరియంట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెన్షన్ పెడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎనభై దేశాలకు పైగా విస్తరించిన డెల్టావేరియంట్ నుండి ఆయా దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. మన దేశంలో కూడా సెకండ్ వేవ్ లో దండెత్తిన ఈ వేరియంట్ సృష్టించిన మరణ మృదంగం అంతా ఇంతా కాదు. అదలా ఉండగానే ఇప్పుడు డెల్టా ప్లస్ వేరియంట్ కూడా ప్రపంచవ్యాప్తంగా మరింత భయపెడుతుంది. ఇప్పటికే మాస్క్ ఫ్రీగా ప్రకటించుకున్న అమెరికా లాంటి దేశాలను కూడా ఈ డెల్టా వేరియంట్ టెన్షన్ పెడుతుంది.

డెల్టా వేరియంట్‌తో అమెరికాకు పెను ముప్పు పొంచి ఉంద‌ని ఆ దేశ అంటువ్యాధుల నిపుణులు డాక్ట‌ర్ ఆంటోనీ ఫౌచీ వెల్లడించారు. అమెరికా నుంచి క‌రోనాను పూర్తిగా పార‌దోలాల‌ని అనుకుంటున్న త‌మ‌కు ఇది స‌వాలేన‌ని ఫౌచీ పేర్కొన్నారు. డెల్టా వేరియంట్ వ్యాప్తి చాలా ఎక్కువ‌గా ఉండడంతో పాటు వ్యాధి తీవ్రత కూడా ఎక్కువ‌గా ఉన్న‌ట్లు ఆయన చెప్పారు. అయితే ప్ర‌స్తుతం అమెరికాలో ఇస్తున్న అన్ని వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ను స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్న‌ట్లు వెల్లడించిన ఫౌచీ దీనికి ఎదుర్కొనేందుకు మా ద‌గ్గ‌ర సాధ‌నాలు ఉన్నాయని తెలిపారు.

డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు మా సాధనాలతో శాయశక్తులా ప్రయత్నిస్తామని.. ఇది ఒకరకంగా మాకు సవాలేనన్నారు. మ‌రోవైపు జులై 4 క‌ల్లా దేశంలోని వ‌యోజ‌నుల్లో 70 శాతం మందికి వ్యాక్సినేష‌న్ పూర్తి చేయాల‌న్న ల‌క్ష్యాన్ని అమెరికా అందుకునేలా క‌నిపించ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ అమెరికాలో 45 శాతం మంది అంటే 15 కోట్ల మందికి వ్యాక్సినేష‌న్ పూర్తికాగా 70 శాతం మందికి వ్యాక్సినేష‌న్ కు మ‌రికొన్ని వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు.