Tiger Nageshwar Rao: రవితేజ మూవీలో బాలీవుడ్ నటుడు.. ఎవరంటే?
మాస్ రాజా రవితేజ నటిస్తున్న నెక్ట్స్ చిత్రాల్లో ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపింది. తాజాగా బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది.

Tiger Nageswara Rao: మాస్ రాజా రవితేజ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన నటించబోయే సినిమాల్లో ‘టైగర్ నాగేశ్వర రావు’ మూవీపై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను నిజజీవిత సంఘటనల ఆధారంగా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ మూవీ ఎలాంటి కథతో రాబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దర్శకుడు వంశీ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు.
Tiger Nageswara Rao: మాస్ రాజాకి గజదొంగ స్టోరీ ట్రాక్ ఎక్కిస్తుందా?
అయితే ఈ సినిమాలో నటీనటులు ఎవరా అనే విషయంపై చిత్ర యూనిట్ ఒక్కక్కరి పేరును అనౌన్స్ చేస్తూ వస్తోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోదరి నుపూర్ సనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండగా, ఇప్పుడు బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అనుపమ్ ఖేర్ ఈ సినిమాలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఆయన నటిస్తున్న విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు టైగర్ నాగేశ్వర రావు టీమ్. ఈ పోస్టర్‌లో ఆయన వెనకాల నుంచి సీరియస్‌గా కనిపిస్తున్నట్లు చూపెట్టారు.
Tiger Nageswararao : రవితేజ ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కోసం.. ఏకంగా 7 కోట్లతో ఒక్క సెట్..
బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీలో సెన్సేషనల్ పాత్రలో నటించారు అనుపమ్ ఖేర్. ఆ సినిమాలో ఆయన నటనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంతేగాక టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న కార్తికేయ-2 సినిమాలోనూ అనుపమ్ ఖేర్ నటిస్తున్నారు. ఇప్పుడు రవితేజ ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాలోనూ ఆయన నటిస్తుండటంతో ఈ విలక్షణ నటుడు ఎలాంటి పాత్రలో కనిపిస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక టైగర్ నాగేశ్వర రావు ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రాబోతున్నట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
Welcoming the legendary National Award actor @AnupamPKher to #TigerNageswaraRao in a powerful role?@RaviTeja_offl @DirVamsee @AbhishekOfficl @MayankOfficl @NupurSanon @gaya3bh @gvprakash @madhie1 @kollaavinash @SrikanthVissa @AAArtsOfficial @CastingChhabra pic.twitter.com/qIZwHL4Txp
— Tiger Nageswara Rao (@TNRTheFilm) August 2, 2022