Anupama Parameswaran: పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిన అనుపమ ట్వీట్..

మన సినిమా హీరోలకు అభిమానులలో ఎంతటి స్థానం ఉంటుందో మీకు తెలిసిందే. తనకు నచ్చిన నటుడికి ఏకంగా గుడి కట్టేసి గుండెల్లో స్థానం ఇచ్చేసే కల్చర్ మనది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయనకు అభిమానులే కాదు.. అంతకు మించి భక్తులు ఉన్నారు.

Anupama Parameswaran: పవన్ అభిమానులకు ఆగ్రహం తెప్పించిన అనుపమ ట్వీట్..

Anupama Parameswaran

Anupama Parameswaran: మన సినిమా హీరోలకు అభిమానులలో ఎంతటి స్థానం ఉంటుందో మీకు తెలిసిందే. తనకు నచ్చిన నటుడికి ఏకంగా గుడి కట్టేసి గుండెల్లో స్థానం ఇచ్చేసే కల్చర్ మనది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఆయనకు అభిమానులే కాదు.. అంతకు మించి భక్తులు ఉన్నారు. ఇటు ఇండస్ట్రీ నుండి బయట ప్రేక్షకుల వరకు ఆయన మీద చిన్న మాట అన్నా సహించలేని అభిమానులున్నారు. ఇక ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వలేదు అవమానం జరిగిందని భావిస్తే ఈ అభిమానులే అలా అవమానించిన వారిని ఏకిపారేస్తారు.

అలా అనుకోకుండా పవన్ అభిమానులకు దొరికేసింది హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్. పవన్ కళ్యాణ్ ను గౌరవించకుండా అనుపమ చేసిన ట్వీట్ చిక్కులు తెచ్చిపెట్టింది. నిన్నటి వరకు థియేటర్లలో హంగామా సృష్టించిన పవన్ వకీల్ సాబ్ సినిమా నిన్నటి నుండి ఓటీటీలో దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. కాగా అనుపమ ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్‌లో చూసి చిత్రయూనిట్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఓ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్‌లో అందిరిని మెచ్చుకున్న అను అందరినీ పేరు పేరునా పొగిడేసింది.

ఇందులో నటించిన నివేదా థామస్, అంజలి, అనన్యాలు అదరగొట్టారని తెలిపిన అనుపమ ఇక నటుడు ప్రకాష్‌రాజ్‌ సార్‌ లేకపోతే సినిమాను ఊహించుకోలేమని ఆకాశానికి ఎత్తేసింది. అలానే పవన్ కళ్యాణ్ కట్టలు తెంచుకొనే ఆవేశంతో కూడిన నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిందని ప్రశంసలు కురిపించింది. ఇందులో అమెజాన్ నుండి నివేదా, అంజలి ఐడీలతో పాటు ప్రకాష్ రాజ్ ఐడీతో పాటు సార్ అంటూ సంబోధించింది. కానీ పవన్ కళ్యాణ్ ఐడీతో పాటు సార్ అనడం మర్చిపోయింది. దీంతో పవన్ అభిమానులు ఆగ్రహించారు.

ముందు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో అంటూ మెగా ఫ్యాన్స్ కామెంట్స్ షురూ చేశారు. ప్రకాష్ రాజ్ సార్ అని పిలిచిన అనుపమ పవన్ కళ్యాణ్ ఐడీ మాత్రమే ట్యాగ్ చేసి వదిలేయడాన్ని జీర్ణించుకోలేకపోయారు. వరసబెట్టి విమర్శల జల్లు కురిపించడం మొదలుపెట్టారు. అరే.. మిస్టేక్ జరిగిందే అని గమనించిన అనుపమ వెంటనే తను రియలైజ్ అయినట్లుగా పేర్కోంటూ సారీ చెప్పింది. పవన్ కళ్యాణ్ గారు.. అంటే ఎంతో గౌరవం, ప్రేమ అని తెలిపుతూ మరో ట్వీట్ చేసింది. దీంతో పవన్ భక్తులు శాంతించారు.