కోహ్లీ సతీమణి అనుష్క ప్రెగ్మెంట్ ? Photo shop క్రియేట్

  • Published By: madhu ,Published On : June 19, 2020 / 07:49 AM IST
కోహ్లీ సతీమణి అనుష్క ప్రెగ్మెంట్ ? Photo shop క్రియేట్

ప్రముఖ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ..సతీమణి, బాలీవుడ్ బ్యూటీ అనుష్క గర్భవతా ? త్వరలోనే తల్లికానుందా ? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఎందుకంటే..గర్భవతిగా ఉన్న అనుష్క ఫొటో వైరల్ అవుతోంది. అనుష్క కడుపుపై కోహ్లీ చేతులు వేసుకుని..నవ్వుతూ ఉందా ఆ ఫొటో. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న దీనిపై నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. చివరకు నిజం తెలిసి షాక్ తిన్నారు.

ఎందుకంటే..దానిని ఎడిట్ చేశారంట. ఓ ప్రబుద్దుడు…అనుష్క బేబీ బంప్ తో ఉన్న ఫొటో షాప్ ఎడిట్ చేశాడు. అసలు విషయం ఏమిటంటే..నటి జెనీలియా, రితేష్ తో కలిసి ఓ ఫొటో షూట్ చేసింది. ఆ సమయంలో జెనీలియా గర్భవతి. అందులో ఓ పిక్ తీసుకుని వారి ముఖాల స్థానంలో అనుష్క, కోహ్లీ ఫొటోలను ఉంచడం..ఈ ఫొటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. దీనిపై కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ గా ఉన్న కోహ్లీ..అనుష్కలు ప్రేమించి వివాహం చేసుకున్నారు. 2017, డిసెంబర్ 11వ తేదీన వివాహం జరిగింది. ఇటలీలోని టుస్కానీ ప్రాంతంలో వీరి వివాహం జరిగింది. అతికొద్ది మంది కుటుంబసభ్యల మధ్య వివాహం జరిగింది. పెళ్లి వేడుకలు, సంగీత్, ఇలా ప్రతొక్క వేడుకకు సంబంధించిన ఫొటోలు బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీరి వివాహం జరిగి మూడు సంవత్సరాలు అవుతోంది. అప్పుడప్పుడు అనుష్క ప్రెగ్మెంట్ అని వార్తలు వచ్చినా..పూర్తి క్లారిటీ ఇవ్వలేదు. 

Read: సుశాంత్ అకాల మరణం.. మరో అభిమాని ఆత్మహత్య..