Virat Kohli Birthday: కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన సతీమణి అనుష్క శర్మ

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 34వ పుట్టినరోజు సందర్భంగా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు విసెస్ చెబుతున్నారు. ఈ సందర్భంగా కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు.

Virat Kohli Birthday: కోహ్లీకి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ.. ఆసక్తికర ఫొటో షేర్ చేసిన సతీమణి అనుష్క శర్మ

Virat Kohli Birthday: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 34వ ఏట అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా కోహ్లీకి బర్త్ డే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కుటుంబ సభ్యులు, క్రికెటర్లు, ప్రముఖులు, అభిమానులు కోహ్లీకి సోషల్ మీడియా ప్లాట్ ఫాంల వేదికగా బర్త్ డే విసెస్ చెబుతున్నారు. విరాట్ కోహ్లీ సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కోహ్లీకి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర ఫొటోను షేర్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

అదేవిధంగా బీసీసీఐ భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ట్విటర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా కోహ్లీ అధ్భుతమైన రికార్డులను గుర్తు చేసింది. టీమిండియా తాజా, మాజీ క్రికెటర్లు, ప్రపంచ దేశాల క్రీడాకారులు, సినీ, రాజకీయ ప్రముఖులు కోహ్లీకి సామాజిక మాధ్యమాల వేదికగా పుట్టిన శుభాకాంక్షలు తెలిపారు.