AP CM Jagan: కృష్ణ భౌతిక‌కాయానికి నివాళులర్పించిన ఏపీ సీఎం జగన్.. ఫొటోలు

AP CM Jagan: సూపర్‌స్టార్ కృష్ణ భౌతికకాయానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. పద్మాలయ స్టూడియోలో ఉంచిన కృష్ణ భౌతికకాయాన్ని బుధవారం సీఎం జగన్ సందర్శించారు. అనంతరం పూలమాలవేసి నివాళులర్పించారు. హీరో మహేష్ బాబును హత్తుకొని ఓదార్చారు. కుటుంబ సభ్యులు మంజుల, నమ్రత, గౌతమ్‌‌లతోపాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఇటువంటి కఠిన సమయంలో ధైర్యంగా ఉండాలన్నారు. కాగా, పద్మాలయ స్టూడియోలో ఉన్న కృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 3గంటల సమయంలో కృష్ణ భౌతికకాయానికి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అత్యక్రియలు నిర్వహిస్తారు.

1/12
2/12
3/12
4/12
5/12
6/12
7/12
8/12
9/12
10/12
11/12
12/12