2 నెలల తర్వాత సచివాలయానికి సీఎం జగన్

2 నెలల తర్వాత సచివాలయానికి సీఎం జగన్

cm jagan to visit secretariat: రెండు నెలల తర్వాత ఏపీ సీఎం జగన్ సచివాలయానికి రానున్నారు. గత ఏడాది(2020) డిసెంబర్ 18న కేబినెట్ సమావేశం జరిగింది. దానికి జగన్ అటెండ్ అయ్యారు. ఆ తర్వాత సచివాలయానికి వెళ్లింది లేదు. సుదీర్ఘ విరామం తర్వాత హైపవర్ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సమావేశం కోసం సీఎం సచివాలయానికి వస్తున్నారు. సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించి నిర్వహించనున్న ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మంత్రులు బుగ్గన, సుచరిత, విశ్వరూప్ హాజరుకానున్నారు.

కేబినెట్ లేకపోయినా సచివాలయానికి జగన్ రానున్నారు. ఉదయం 10:30గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సచివాలయానికి చేరుకోనున్న సీఎం జగన్ మధ్యాహ్నం 1 గంట వరకు అక్కడే ఉండనున్నారు.

కొంత కాలంగా కరోనా, రాజధాని ఉద్యమాల కారణంగా కేవలం కేబినెట్ సమావేశాల సమయంలోనే సీఎం జగన్ సచివాలయనికి వస్తున్నారు. సచివాలయంలో నేడు(ఫిబ్రవరి 4,2021) ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో సమావేశం కావాలని భావించినా ఆ సమావేశం రద్దు అయ్యింది.