YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు

కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు పది కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అదనంగా రూ.69 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు.

YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం వరాల జల్లు

Ys Jagan

YS Jagan: శ్రీకాకుళం జిల్లాకు ఏపీ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. అమ్మ ఒడి మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని వై.ఎస్.జగన్, సోమవారం శ్రీకాకుళం జిల్లా నుంచే ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు పలు వరాలు ప్రకటించారు.

Roorkee Gangrape: మహిళ, ఆమె ఆరేళ్ల కూతురుపై కారులో అత్యాచారం

కోడి రామ్మూర్తి స్టేడియం పనులకు పది కోట్ల రూపాయల నిధులను వెంటనే విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌కు అదనంగా రూ.69 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆముదాల వలస-శ్రీకాకుళం ఫోర్ వే రోడ్డు, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.18 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. వంశధార ఎత్తిపోతలకు రూ.189 కోట్లు విడుదల చేస్తామన్నారు. వంశధార ఫేజ్-2, స్టేజ్ 2 పనులకు రివైజ్ చేసిన జీవో కింద రూ.2,407 కోట్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును డిసెంబర్ నెలలో జాతికి అంకితం చేయనున్నట్లు వెల్లడించారు.

Jubilee Hills Rape Case: నిందితుల డీఎన్ఏ సేకరణకు పోలీసుల ఏర్పాట్లు

ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు కోసం ఇచ్చాపురం, పలాస, పాతపట్నం నియోజకవర్గాలలోని 807 గ్రామాల్లో రూ.700 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. ఇప్పటికే దీనికి సంబంధించి 70 శాతం పనులు పూర్తికాగా, పాతపట్నం నియోజకవర్గంలోని మూడు మండలాలకు అదనంగా రూ.285 కోట్లు కేటాయించారు. త్వరలోనే పలాస్ ఆఫ్‌షోర్‌కు రూ.850 కోట్లు మంజూరు చేసి, యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని హామీ ఇచ్చారు.