AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల వాయిదా.. త్వరలో కొత్త తేదీలు!

ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. మరో మూడు రోజులలో పరీక్షలు మొదలు కానుండగా రేపు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ కొనసాగనుంది.

AP Inter Exams: ఏపీలో ఇంటర్ పరీక్షల వాయిదా.. త్వరలో కొత్త తేదీలు!

Ap Inter Exams

AP Inter Exams: ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. మరో మూడు రోజులలో పరీక్షలు మొదలు కానుండగా రేపు హైకోర్టులో ఇదే అంశంపై విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కోర్టు ప్రభుత్వం మరోసారి పునరాలోచించుకోవాలని సూచించిన నేపథ్యంలో ప్రభుత్వం కోర్టు నిర్ణయాన్ని గౌరవిస్తూ వాయిదా నిర్ణయం తీసుకుంది. త్వరలోనే కొత్త తేదీలను నిర్ణయించి వెల్లడిస్తామని చెప్పిన రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ సోమవారం కోర్టులో ఇదే విషయాన్ని నివేదిస్తామని చెప్పారు.

శుక్రవారం ఇదే అంశంపై కోర్టులో విచారణ జరుగుతుండగా దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉండడంతో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై పునరాలోచించుకోవాలని కోరింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసిన కోర్టు అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశిస్తూ మే 2లోపు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రభుత్వం ఆదివారం వరకూ పరీక్షలు నిర్వహించాలనే అభిప్రాయంతోనే ఉండగా చివరికి వాయిదాకు నిర్ణయించుకుంది. దీనిపై ప్రభుత్వం కోర్టుకు నివేదిక అందజేయనుంది. కాగా టెన్త్ పరీక్షలను కూడా నిర్వహించి తీరుతామని ప్రకటించగా దానిపై ఇంకా ఎలాంటి మార్పు నిర్ణయాన్ని ప్రభుత్వం ప్రకటించలేదు. జూన్ నెలలో టెన్త్ పరీక్షల నిర్వహణకు తేదీ ప్రకటించిన ప్రభుత్వం అప్పటికి దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.