Movie Tickets : ఏపీలో మళ్ళీ సినిమా టికెట్ల గొడవ.. హైకోర్టులో విచారణ..

తంలో ఏపీలో సినిమా టికెట్ల కోసం జరిగిన రచ్చ తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడం, వాటిని పెంచమనడం, సినిమా టికెట్ లని ప్రభుత్వమే అమ్ముతాము అనడం.. ఇలా చాలా జరిగాయి. టికెట్ రేట్ల గొడవ తీరినా...

Movie Tickets : ఏపీలో మళ్ళీ సినిమా టికెట్ల గొడవ.. హైకోర్టులో విచారణ..

Ap Movie Tickets

Movie Tickets :  గతంలో ఏపీలో సినిమా టికెట్ల కోసం జరిగిన రచ్చ తెలిసిందే. టికెట్ రేట్లు తగ్గించడం, వాటిని పెంచమనడం, సినిమా టికెట్ లని ప్రభుత్వమే అమ్ముతాము అనడం.. ఇలా చాలా జరిగాయి. టికెట్ రేట్ల గొడవ తీరినా, ఆన్లైన్ లో సినిమా టికెట్లు అమ్మడం ఇంకా అవ్వలేదు. ప్రభుత్వమేమో మేమే సినిమా టికెట్లు అమ్ముతాము గవర్నమెంట్ ఆన్లైన్ పోర్టల్ నుంచి అంటుంది. ఇటు థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ వద్దు అంటున్నారు. దీంతో మళ్ళీ ఈ టికెట్ల గొడవ హైకోర్టు వరకు వెళ్ళింది.

ప్రభుత్వమే నేరుగా ఆన్‌లైన్‌ ద్వారా సినిమా టికెట్లు విక్రయించేందుకు గతేడాది సవరణ చట్టం తీసుకొచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆన్‌లైన టికెట్లు విక్రయ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ బిగ్‌ ట్రీ ఎంటర్‌టైన్మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ సందీప్‌ అన్నోజ్‌వాలా హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారం చేపట్టిన ధర్మాసనం ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయశాఖ కార్యదర్శి, హోంశాఖ ముఖ్యకార్యదర్శి, ఏపీ స్టేట్‌ ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ తదితరులకు నోటీసులు జారీచేసింది హైకోర్టు.

Don : ‘డాన్’కి మరో సీక్వెల్.. అమితాబ్, షారుఖ్ కాంబోలో??

తదుపరి విచారణను ఈ నెల 27కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా.. తదితరులతో కూడిన ధర్మాసనం తెలిపింది. మరి ఈ సారి అయినా టికెట్ల గొడవ ఓ కొలిక్కి వచ్చేనా చూడాలి.