ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

ఏపీలో పంచాయతీ ఎన్నికల కౌంటింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగియగా.. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టగా.. ఫలితాల వెల్లడి అనంతరం ఉపసర్పంచ్‌ ఎన్నిక జరగనుంది.

క్యూలైన్‌లో ఉన్నవారికి సాయంత్రం 4గంటల వరకు ఓటు హక్క వినియోగించే అవకాశం కల్పించారు. మద్యాహ్నం 2.30 గంటల వరకు 75.55 శాతం పోలింగ్‌ నమోదవగా.. రాష్ట్రవ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.

మొత్తం 2,723 పంచాయతీల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సాగుతోంది. తొలి దశలో ఇప్పటివరకు 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 12 జిల్లాల్లోని 18 రెవెన్యూ డివిజన్లలో తొలిదశ పోలింగ్ జరిగింది. 20,157 వార్డులకు పోలింగ్‌ నిర్వహించారు.