ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్

ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ ఆఫర్

ap rtc bumper offer to passengers: ప్రయాణికులకు ఏపీ ఆర్టీసీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. బస్సు చార్జీలో రాయితీ ఇచ్చింది. అయితే రాయితీ కండీషన్స్ అప్లయ్ అవుతాయి. మార్చి 31వ తేదీ వరకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది.

డాల్పిన్, అమరావతి, ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ప్రయాణించడానికి 48 గంటల ముందు టిక్కెట్లను రిజర్వు చేసుకుంటే ఛార్జీలో 10 శాతం రాయితీ కల్పించనున్నారు. ఈ విషయాన్ని ఆర్టీసీ సంస్థ రీజినల్‌ మేనేజర్‌ జితేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. ఈ రాయితీ సౌకర్యం విశాఖపట్టణం, విజయవాడ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాలకు వెళ్లే ప్రయాణీకులకు మాత్రమే వర్తిస్తుందన్నారు.

కాగా, ఈ రాయితీకి సంబంధించి కండీషన్స్ అప్లయ్ అంటోంది ఆర్టీసీ. అవేమిటంటే..

* రాయితీ పొందేందుకు 48 గంటల ముందు రిజర్వ్ చేసుకోవాలి.

* తొలి నాలుగైదు సీట్లకు మాత్రమే రాయితీ ఉంటుంది.

* డాల్ఫిన్‌ బస్సులో 58 సీట్ల కెపాసిటీ ఉంటే తొలి ఐదుగురికి

* అమరావతి బస్సులో 49 సీట్ల కెపాసిటీ ఉంటే తొలి ఐదుగురికి

* ఇంద్ర బస్సులో 40 సీట్లు ఉంటే తొలి నలుగురికి

* సూపర్‌ లగ్జరీలో 35 సీట్లకుగాను తొలి నలుగురికి

* అల్ట్రా డీలక్స్‌లో 39 సీట్లకుగాను తొలి నలుగురికి

* ఎక్స్‌ప్రెస్‌ బస్సులో 49 సీట్లు ఉంటే తొలి ఐదుగురికి రాయితీ అవకాశం ఉంటుంది

* ఈ అవకాశం మార్చి 31 వరకే అమల్లో ఉంటుంది.

* జర్నలిస్టులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ సిబ్బందికి రాయితీలు వర్తించవు.