AP-Telangana Boarder: నిలిచిన అంబులెన్స్‌లు.. ఇద్దరు మృతి!

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయలోపం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు.

AP-Telangana Boarder: నిలిచిన అంబులెన్స్‌లు.. ఇద్దరు మృతి!

Ap Telangana Boarder Stopped Ambulances Two Killed

AP-Telangana Boarder: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయలోపం ప్రజల ప్రాణాల మీదకి తెస్తుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు కరోనా రోగులతో వస్తున్న అంబులెన్స్‌లను తెలంగాణ పోలీసులు రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద అడ్డుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలోని అంతర్రాష్ట్ర సరిహద్దు, కర్నూలు జిల్లా పుల్లూరు టోల్‌గేట్ వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు చేపట్టి ఆసుపత్రి వివరాలు లేకపోతే వెనక్కు పంపుతున్నారు. తెలంగాణలో లాక్ డౌన్ మొదలైన తొలిరోజే ఇది వివాదం కాగా తర్వాత రోజు సడలింపు ఇచ్చారు.

కానీ, గురువారం రాత్రి మళ్ళీ అదే పరిస్థితి నెలకొంది. కరోనా రోగులతో ఏపీ నుంచి వస్తున్న అంబులెన్స్‌లను వెనక్కి పంపుతున్నారు. అనుమతి లేనిదే తెలంగాణలోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో కర్నూలు సరిహద్దులో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఏపీ అంబులెన్స్‌లను అనుమతించకపోవడంతో చికిత్స అందక ఇద్దరు కోవిడ్ రోగులు మరణించారు. నిన్న రాత్రి అక్కడ 30 వరకు అంబులెన్స్‌లు నిలిచిపోగా ఇద్దరు రోగుల పరిస్థితి విషమించి ప్రాణాలు విడిచారు.

మరోవైపు గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఏపీ నుంచి తెలంగాణలోకి అంబులెన్స్‌లను అనుమతించడం లేదని ఏపీ వాసులు వాపోతున్నారు. కాగా, పుల్లూరు చెక్‌పోస్టుకు వచ్చిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ సిబ్బందితో మాట్లాడినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఎమ్మెల్యే రాష్ట్ర ఉన్నతాధికారులు, రాష్ట్ర వైద్యాధికారులతోనూ మాట్లాడారు. కానీ, ఈ పాస్ లేదా తెలంగాణ ఆసుపత్రులలో పడక రిజర్వ్ చేసుకున్న వారికి మాత్రమే అనుమతి ఇస్తామని చెప్పడంతో రోగులలో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నవారిని ఎమ్మెల్యే కర్నూలు ఆస్పత్రికి పంపించారు.