Apple Fix Bug Safari : మీ సఫారీ బ్రౌజర్‌ క్రాష్ అవుతుందా? బగ్ ఫిక్స్ చేసేందుకు ఆపిల్ సర్వర్ అప్‌డేట్‌‌ వచ్చేసింది..!

Apple Fix Bug Safari : కుపెర్టినో కంపెనీ యాజమాన్యంలోని ఆపిల్ సఫారీ బ్రౌజర్ యూజర్లకు అలర్ట్.. మీ సఫారీ బ్రౌజర్ పదేపదే క్రాష్ అవుతుందా? అయితే డోంట్ వర్రీ.. Apple రిపోర్టు ప్రకారం.. iPhoneలు iPadలలో Safari పదేపదే క్రాష్ అవుతుందా?

Apple Fix Bug Safari : మీ సఫారీ బ్రౌజర్‌ క్రాష్ అవుతుందా? బగ్ ఫిక్స్ చేసేందుకు ఆపిల్ సర్వర్ అప్‌డేట్‌‌ వచ్చేసింది..!

Apple rolls out server update to fix bug crashing the Safari Report

Apple Fix Bug Safari : కుపెర్టినో కంపెనీ యాజమాన్యంలోని ఆపిల్ సఫారీ బ్రౌజర్ యూజర్లకు అలర్ట్.. మీ సఫారీ బ్రౌజర్ పదేపదే క్రాష్ అవుతుందా? అయితే డోంట్ వర్రీ.. Apple రిపోర్టు ప్రకారం.. iPhoneలు iPadలలో Safari పదేపదే క్రాష్ అవుతుందా? అయితే ఈ బగ్‌ను ఆపిల్ సర్వర్ అప్‌‌డేట్ ద్వారా ఫిక్స్ చేసేసింది. చాలా మంది సఫారీ యూజర్లు ఇటీవల ట్విటర్‌లో బ్రౌజర్ క్రాష్ అవుతుందని ఫిర్యాదు చేశారు. వాస్తవానికి, ఈ యూజర్లలో కొందరు సఫారీ బ్రౌజర్ సమస్యకు సంబంధించి స్క్రీన్ షేర్ చేశారు. 9to5Mac నివేదిక ప్రకారం.. Apple Safariలోని బగ్‌ను ఫిక్స్ చేసేందుకు సర్వర్ సైడ్ అప్‌డేట్‌ను రిలీజ్ చేసింది.

నివేదిక ప్రకారం.. ఐఫోన్ యూజర్లు సఫారిలోని అడ్రస్ బార్‌లో కొన్ని పదాలను టైప్ చేయడం ద్వారా బ్రౌజర్ యాప్ వెంటనే షట్ డౌన్ అవుతుందని నివేదించారు. ఈ బగ్ నిర్దిష్ట వెబ్‌సైట్‌ల URLను టైప్ చేయకుండా అడ్డుకుంటుంది. iPad, iPhone యూజర్లను బ్రౌజర్ ఓపెన్ చేయకుండానే క్లోజ్ అవుతుంది.

అంతేకాదు.. ఈ బగ్ కారణంగా iOS 16 వెర్షన్‌లోని బ్రౌజర్ పనితీరును కూడా ప్రభావితం చేసింది. ముఖ్యంగా, సఫారీ క్రాష్‌ కావడానికి ‘తారు, పాత, ప్లా, వేల్’ మరిన్ని అక్షరాలే కారణమని నివేదిక సూచించింది. వినియోగదారు టైప్ చేయగానే.. Safariలో కనిపించే సూచించిన ఫలితాలను సర్వర్ వైపు టెక్స్ట్ రెండరింగ్ బగ్ ప్రభావితం చేస్తోందని నివేదిక తెలిపింది.

Apple rolls out server update to fix bug crashing the Safari Report

Apple rolls out server update to fix bug crashing the Safari Report

ఆపిల్ ఐఫోన్‌లను కంపెనీ బీటా సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లకు భారత మార్కెట్లో 5G కనెక్టివిటీకి సపోర్టు ఇచ్చే అప్‌డేట్ లాంచ్ చేయడం ప్రారంభించింది. ఆపిల్ iOS 16 బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసినట్టు ధృవీకరించింది. గత నెలలో Apple ప్రకటన ప్రకారం.. కంపెనీ ఈ ఏడాదిలో డిసెంబర్ నుంచి iPhoneలలో 5G కనెక్టివిటీ పూర్తి స్థాయిలో ప్రారంభించాలని భావిస్తున్నారు. ఐఫోన్‌లలో 5G కనెక్టివిటీ iPhone 14 సిరీస్, iPhone 13, iPhone 12, iPhone SE (3rd Gen)లలో పని చేస్తుంది.

డివైజ్‌లు Airtel, Reliance Jio రెండింటి నుంచి 5G కనెక్టివిటీకి సపోర్టు అందిస్తాయి. ప్రస్తుతానికి, iOS 16.2తో బీటా ప్రోగ్రామ్‌లో భాగంగా కంపెనీ 5G సాఫ్ట్‌వేర్ అందిస్తోంది. సఫారీ యూజర్లు కంపెనీ బీటా ప్రోగ్రామ్‌కు సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. వారికి iOS బీటా వెర్షన్‌కి యాక్సెస్ పొందవచ్చు. బీటా సాఫ్ట్‌వేర్ ఇతర బగ్‌లు, గ్లిచ్‌లను కలిగి ఉండవచ్చు. అలాంటి సాఫ్ట్‌వేర్‌ను ప్రైమరీ డివైజ్లలో ఉపయోగించకపోవడమే మంచిదని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Mobile Phone Users : భారత్‌లో 1.2 బిలియన్లకుపైనే మొబైల్ ఫోన్ యూజర్లు.. నివేదికలో వెల్లడి!