iPhone 13 Series : భారతీయుల నుంచి భారీ స్పందన, రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్

ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో ఈ త్రైమాసికంలో ఆపిల్‌ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. పండుగల సీజన్‌తో భారత్‌లో ఆపిల్‌ భారీ వృద్దిని నమోదు

iPhone 13 Series : భారతీయుల నుంచి భారీ స్పందన, రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్

Iphone 13 Series

iPhone 13 Series : ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ప్రీ-బుకింగ్స్‌లో భారతీయుల నుంచి భారీ స్పందన లభించింది. గతేడాది లానే రికార్డు స్థాయిలో దేశవ్యాప్తంగా ఐఫోన్‌-13 స్మార్ట్‌ఫోన్లపై అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ట్రెండ్ చూస్తుంటే గత త్రైమాసికంలో ఐఫోన్‌-12 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల తరహాలో ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడ్డారు.

Apple iPhone: భారీ తగ్గింపు ధరలతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో ఐఫోన్‌లు

ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలతో ఈ త్రైమాసికంలో ఆపిల్‌ గణనీయమైన వృద్దిని సాధిస్తుందని వ్యాపార నిపుణులు అంచనా వేశారు. పండుగల సీజన్‌తో భారత్‌లో ఆపిల్‌ భారీ వృద్దిని నమోదు చేస్తుందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ డైరక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ అన్నారు. అందుకు ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్ల ప్రీ-బుకింగ్స్‌ ఆర్డర్స్ స్పష్టం చేస్తుందన్నారు. రాబోయే పండుగ సీజన్‌లో ఐఫోన్‌-12 సిరీస్‌, పాక్షికంగా ఐఫోన్‌-13, 13 ప్రో స్మార్ట్‌ఫోన్స్‌ ద్వారా యాపిల్ ఊపందుకుంటుందని ఐడిసి ఇండియా, దక్షిణాసియా రీసెర్చ్ డైరెక్టర్ నవకేందర్ సింగ్ అంచనా వేశారు.

IT Recruitment : ఐటీలో 15,000 ఉద్యోగాలు

సెప్టెంబర్ 24 నుంచి నాలుగు కొత్త ఐఫోన్‌ -13 స్మార్ట్‌ఫోన్స్‌ కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ రూ. 69వేల 900 నుంచి ప్రారంభించి ప్రో మాక్స్ రూ.1,29,900 వరకు అందుబాటులో ఉన్నాయి. ఐఫోన్‌-13 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లను ఈ నెల 14న ఆపిల్‌ లాంచ్‌ చేసింది. భారత్ లో సెప్టెంబర్‌ 17 నుంచి ప్రీ-బుకింగ్‌ ఆర్డర్స్‌ జరుగుతాయని ఇదివరకే ఆపిల్‌ ప్రకటించింది.