Apple Watch: సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా కాల్స్, మెసేజెస్

యాపిల్ తమ కస్టమర్ల కోసం మరో సూపర్ ఫీచర్ తీసుకురానుంది. యాపిల్ స్మార్ట్ వాచ్ లు వాడుతున్న వారికి భవిష్యత్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఇచ్చేందుకు కృషి చేస్తుంది. దీని సహకారంతో యూజర్లు..

Apple Watch: సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా కాల్స్, మెసేజెస్

Apple Watch

Apple Watch: యాపిల్ తమ కస్టమర్ల కోసం మరో సూపర్ ఫీచర్ తీసుకురానుంది. యాపిల్ స్మార్ట్ వాచ్ లు వాడుతున్న వారికి భవిష్యత్ లో శాటిలైట్ కనెక్టివిటీ ఇచ్చేందుకు కృషి చేస్తుంది. దీని సహకారంతో యూజర్లు SOS రెస్పాన్స్ తో పాటు ఎమర్జెన్సీ టెక్స్టింగ్ తమ చేతి నుంచే నేరుగా పంపించుకోవచ్చు.

కాకపోతే ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి కాస్త ఎక్కువ సమయమే పట్టొచ్చు. 2024వరకూ టైం పడుతుందని చెబుతున్నారు. గతంలో ఐఫోన్ 13 సిరీస్ తోనే ఈ శాటిలైట్ కనెక్టివిటీ వస్తుందంటూ రూమర్లు వచ్చినప్పటికీ అదేం నిజం కాలేదు. ఇప్పుడు అవే వార్తలను సవరిస్తూ ఐఫోన్ 14 సిరీస్ తో శాటిలైట్ కనెక్టివిటీ వాడుకలోకి వస్తుందంటూ రిపోర్టులు చెప్పుకొస్తున్నారు.

ఇదిలా ఉంటే యాపిల్ మాత్రం ఐఫోన్ 14 లాంచింగ్ విషయంలో శాటిలైట్ కనెక్టివిటీ ఇష్యూ గురించి ప్రస్తావించలేదు. శాటిలైట్ కనెక్టివిటీని రెండు రకాలుగా ప్లాన్ చేస్తుంది కంపెనీ. మొదటిది ఎమర్జెన్సీ మెసేజ్ వయా కాంటాక్ట్స్, రెండోది సంక్షోభాన్ని రిపోర్ట్ చేసుకునేందుకు వీలుండేది.

Read Also: ఈ యాపిల్ ప్రొడక్ట్‌లు కొనాలనుకుంటే కాస్త ఆగండి

ఎమర్జెన్సీ మెసేజ్ కోసం యూజర్లకు ఎటువంటి సిగ్నల్ అవసరం లేదు. మెసేజెస్ యాప్ లో ఇది మనకు గ్రే బబుల్స్ రూపంలో కనిపిస్తుంది. రెండో విషయం యూజర్లు కార్, బోట్, విమాన ప్రమాదం లాంటి సంక్షోభాలపై ఫోకస్ చేస్తున్నారు. సమయానికి తగ్గట్లుగా ఎటువంటి ఎమర్జెన్సీ.. అని అడిగి కన్ఫామ్ చేసుకుంటుంది డివైజ్.