Red Fort : ఎర్రకోటను మూసేసిన ఆర్కియాలజీ అధికారులు

జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి.

Red Fort : ఎర్రకోటను మూసేసిన ఆర్కియాలజీ అధికారులు

Red Fort

Red Fort : జమ్మూలో డ్రోన్ దాడులతో ఢిల్లీలో హైఎలెర్ట్ ప్రకటించారు అధికారులు. దేశరాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక కట్టడం ఎర్రకోటలోకి ప్రవేశాలను నిలిపివేస్తూ ఆంక్షలు విధించారు. స్వతంత్ర దినోత్సవ వేడుకలు ముగిసే వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఎర్రకోట చుట్టూ యాంటీ డ్రోన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు భద్రతాదళాలకు డ్రోన్ టెక్నాలజీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.

జులై 21 నుంచి ఆగస్టు 15 వరకు ఎర్రకోటను మూసివేస్తున్నట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీచేసింది. ఆగస్టు 15కి ఎర్రకోటను ముస్తాబు చేయడం సహా ఉగ్రదాడి జరగొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో భద్రతా కారణాల రీత్యా మూసివేశారు. ఇక ఇప్పటికే ఎర్రకోట శత్రు దుర్బేధ్యంగా మారిపోయింది.

ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని మోదీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. దీనికి సంబందించిన ఏర్పాట్లని ముమ్మరంగా సాగుతున్నాయి. భద్రతా పరంగా తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా ఎర్రకోటను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దెందుకు కావాల్సిన ఏర్పాట్లని చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని అనుమతించడం లేదు.