‘ఆహా’లో అర్ధశతాబ్దం..

డిఫరెంట్ సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్ రంగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘కలర్ ఫొటో’, ‘క్రాక్’ సినిమాలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మార్చి 12 న రాబోయే ‘నాంది’ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘ఆహా’లో అర్ధశతాబ్దం..

Ardhashathabdam: డిఫరెంట్ సినిమాలు, సిరీస్‌లతో డిజిటల్ రంగంలో రోజురోజుకీ దూసుకుపోతోంది తెలుగు ఓటీటీ ‘ఆహా’.. ‘కలర్ ఫొటో’, ‘క్రాక్’ సినిమాలకు ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. మార్చి 12 న రాబోయే ‘నాంది’ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

AHA

AHA

 

ఇప్పుడు మరో వైవిధ్య భరితమైన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది ఆహా.. ‘కేరాఫ్ కంచరపాలెం’ సినిమాతో ఆకట్టుకున్న యువ నటుడు కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, డైలాగ్ కింగ్ సాయి కుమార్, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘అర్ధశతాబ్దం’.. రవీంద్ర పుల్లె డైరెక్ట్ చేశారు. రిషిత శ్రీ క్రియేషన్స్, 24 ఫ్రేమ్స్ సెల్యులాయిడ్ బ్యానర్స్‌పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ నిర్మించారు.

Ardhashathabdam

ఇటీవల విడుదల చేసిన టీజర్, ‘ఏ కన్నులు చూడనీ’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘‘స్వాతంత్ర్యం వచ్చి ‘అర్ధశతాబ్దం’ అయినా కూడా ప్రేమ కోసం చేసే యుద్ధానికి అంతం లేదు.. మార్చి 26 నుండి ఆహాలో ‘అర్ధశతాబ్దం’’.. అంటూ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు..