Telangana : పాలిటిక్స్ వైపు అడుగులేస్తున్న తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లు..?! వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్!

బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్‌గా మారబోతున్నారా? తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలిటిక్స్ వైపు చూస్తున్నారా? వచ్చే ఎన్నికల ముందు.. రాజకీయాలతో సంబంధం లేని వాళ్లంతా.. అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

Telangana : పాలిటిక్స్ వైపు అడుగులేస్తున్న తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్‌లు..?! వచ్చే ఎన్నికల్లో పోటీకి గ్రౌండ్ వర్క్!

Are Ias And Ips Going To Become Politicians In Telangana

Officers choice : బ్యూరోక్రాట్స్.. పొలిటీషియన్స్‌గా మారబోతున్నారా? తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాలిటిక్స్ వైపు చూస్తున్నారా? వచ్చే ఎన్నికల ముందు.. రాజకీయాలతో సంబంధం లేని వాళ్లంతా.. అభ్యర్థులుగా బరిలోకి దిగుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుత్వ శాఖల్లో కీలకంగా ఉంటూ.. కొందరు అధికారులు గ్రౌండ్ లెవెల్‌లో ఏర్పాట్లు కూడా మొదలుపెట్టేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్‌పై.. తమ లక్ చెక్ చేసుకునేందుకు కొందరు ఆఫీసర్లు రాబోతున్నారనే టాక్.. స్టేట్‌ పొలిటికల్ సర్కిల్స్‌లో కొత్త డిబేట్‌కు దారితీసింది.

తెలంగాణ ప్రభుత్వంలో.. కీలక శాఖల్లో.. కీలకమైన అధికారులంతా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం.. ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారనే చర్చ నడుస్తోంది. ఎన్నికల నాటికి.. సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంటుందని.. గులాబీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయ్. పీకే టీం రంగంలోకి దిగాక.. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు భయం పట్టుకుంది. తమ సీటు కాపాడుకునేందుకు.. ఇప్పటి నుంచే అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఈసారి అధికార పార్టీలో చాలా మందికి టికెట్ కట్ చేస్తారనే టాక్ కూడా వినిపిస్తోంది. దీన్నే.. కొందరు అధికారులు తమకు అనుకూలంగా మలచుకునే పనిలో పడ్డారట. ప్రభుత్వంలో కీలకంగా కొనసాగుతూనే.. తమకంటూ ఓ పొలిటికల్ ప్లాట్ ఫామ్‌ను నిర్మించుకునే పనిలో పడ్డారని.. అంతా అనుకుంటున్నారు.

ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డిని.. ఖమ్మం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దించుతారనే వార్తలు.. చాలా రోజులుగా వినిపిస్తున్నాయ్. వచ్చే ఏడాది చివరికి.. ఆయన పదవీ కాలం కూడా ముగుస్తుంది. దీంతో.. ఆయన్ని.. అసెంబ్లీకి పంపే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఉద్యోగుల సంఘం నాయకుడిగా ఉన్న మామిళ్ల రాజేందర్ కూడా.. సంగారెడ్డి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

ఇక.. నిజామాబాద్ సీపీ నాగరాజు కూడా ఇప్పటికే తన మనసులో మాటను బయటకు చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నట్లు తెలిపారు. ఇదే రూటులో.. హైదరాబాద్ కలెక్టర్‌గా శర్మన్ కూడా రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నెల చివరి నాటికి.. ఆయన పదవీకాలం ముగియనుంది. ఆయన.. ఆసిఫాబాద్ బరిలో దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. జలమండలి ఎండీ దానకిశోర్ సైతం పాలిటిక్స్‌లోకి వచ్చేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చెవులు కొరుక్కుంటున్నారు.

వన్స్ అపాన్ ఏ టైమ్.. పార్టీలతో, పాలిటిక్స్‌తో లింక్ ఉన్నోళ్లు.. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ గట్టిగా ఉన్నోళ్లు మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఇప్పుడు సీన్ మారింది. పాలిటిక్స్ అంటే.. పవర్ అనే ముద్రపడిపోయింది. ఇప్పటికే.. కొందరు బ్యూరోక్రాట్స్.. రాజకీయ పార్టీల్లో జాయినైపోయారు. ఆ పవర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అందువల్ల.. వాళ్లలాగే ఇంకొందరు ఐఏఎస్‌లు ఆలోచిస్తున్నారని.. కిందిస్థాయి అధికారుల్లో చర్చ నడుస్తోంది. మొత్తానికి.. సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి బాటలోనే.. చాలా మంది ఐఏఎస్, ఐపీఎస్‌లు నడిచేందుకు సిద్ధమయ్యారు. అయితే.. వీరిలో ఎంతమందికి కలసొస్తుందన్నదే.. ఆసక్తిగా మారింది.