Back Pain : వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా!

సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లాంటివి కారణాలు వెన్నునొప్పికి దారి తీస్తాయి. ఇవి కాకుండా ఆర్థరైటిస్‌, ఇన్‌ఫెక్షన్స్‌, ఫ్రాక్చర్లు, క్యాన్సర్‌ లాంటి వాటివల్లా తీవ్ర వెన్ను నొప్పి వస్తోంది.

Back Pain : వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా!

Back Pain

Back Pain : వెన్నునొప్పి అనేది అత్యంత సాధారణ సమస్యల్లో ఒకటి. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. వెన్ననొప్పి నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది గృహ చికిత్సలతో సరిపెడుతూ ఉపశమనం పొందుతారు. అయితే మరికొందరిలో మాత్రం ఈ చికిత్సల వల్ల ఏమాత్రం ఫలితం ఉండకపోవటంతో వైద్యుల వద్దకు వెళుతున్నారు. వైద్యులు మందులతో నయమయ్యేదైతే అందుకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నారు. లేకుంటే మాత్రం శస్త్రచికిత్సను సూచిస్తున్నారు. ఇది చాలా అరుదుగా అవసరమౌతుంది.

వెన్నునొప్పి లక్షణాల విషయానికి వస్తే కండరాల నొప్పితోపాటు, మంట , కత్తితో పొడిచిన అనుభూతిని కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి కాలు క్రిందికి ప్రసరిస్తుంది. వంగడం, మెలితిప్పడం, ఎత్తడం, నిలబడటం, నడవడం వంటి సందర్భాల్లో నొప్పి మరింత తీవ్రమౌతుంది. కొన్ని వారాల పాటు ఈ సమస్య కొనసాగుతుంది. సాధారణంగా కొన్ని వారాలలో గృహ చికిత్స, స్వీయ సంరక్షణతో వెన్నునొప్పి క్రమంగా తగ్గుతుంది. కొంతమందిలో నొప్పి తీవ్రమై విశ్రాంతితో మెరుగుపడదు. రెండు కాళ్లలో బలహీనత, తిమ్మిరి లేదా జలదరింపు కలిగిస్తుంది. నొప్పి రోజురోజుకు తీవ్రమౌతుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించటం మంచిది.

సరైన భంగిమలో కూర్చోకపోవటం, ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లాంటివి కారణాలు వెన్నునొప్పికి దారి తీస్తాయి. ఇవి కాకుండా ఆర్థరైటిస్‌, ఇన్‌ఫెక్షన్స్‌, ఫ్రాక్చర్లు, క్యాన్సర్‌ లాంటి వాటివల్లా తీవ్ర వెన్ను నొప్పి వస్తోంది. ఆడవాళ్ళల్లో కన్నా మగవాళ్ళల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. కాల్‌సెంటర్లు, కంప్యూటర్ల ముందు కూర్చొని పనిచేసేవాళ్ళల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. వెన్నును ఆరోగ్యంగా, బలంగా ఉంచేందుకు తక్కువ స్ధాయి ఎరోబిక్ వ్యాయామాలు రోజువారిగా చేయటం మంచిది. వెన్నుపై ఒత్తిడి కలిగించని వ్యాయామాలతో వెన్ను బలంగా మారి కండరాలు మెరుగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది.

అధిక బరువు వల్ల వెనుక కండరాలు ఇబ్బంది పడతాయి. మీరు అధిక బరువుతో ఉన్నట్లయితే, తగ్గించడం వల్ల వెన్నునొప్పిని నివారించవచ్చు. ఆరోగ్యకరమైన బరువును మెయింటెన్ చేయటం వల్ల వెన్నునొప్పి దరి చేరకుండ చూసుకోవచ్చు. దూమపానం అలవాటుంటే దానిని వదిలేయండి. ధూమపానం నడుము నొప్పి ప్రమాదాన్ని పెంచుతుంది. కూర్చునే భంగిమల్లో మంచి లోయర్ బ్యాక్ సపోర్ట్, ఆర్మ్‌రెస్ట్‌లు మరియు స్వివెల్ బేస్ ఉన్న సీటును ఎంచుకోండి. బరువుగా ఎత్తవలసి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవటం మంచిది.