Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్ప్రభావాలు ఇవే..

ఎక్కువగా వీటిని వినియోగిస్తే... భవిష్యత్తులో అసలు పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.

Pills : గర్భనిరోధక మాత్రలు వాడుతున్నారా?..దుష్ప్రభావాలు ఇవే..

Pills

Pills : మహిళలు గర్భం ధరించటకుండా ఉండేందుకు చాలా మంది గర్భనిరోధక మాత్రలను తీసుకుంటుంటారు. హార్మోన్లను గర్భనిరోధక మాత్రలు అడ్డుకుంటాయి. గర్భధారణ ధరించకుండా ఉండేందుకు ఇది కేవలం తాత్కాలిక పద్ధతి ఒకందుకు వీటి వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ మరో విధంగా వీటి వాడకం వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావాల్సి వస్తుంది. ఇప్పటికే ఇదే విషయంపై ఆరోగ్యనిపుణులు సైతం తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ మాత్రలను తీసుకోవటం వల్ల కలిగే దుష్ప్రభావాలన్నింటినీ తెలుసుకున్న తరువాతే వీటిని మహిళలు తీసుకోవటం మంచిది. గర్భనిరోధక మాత్రలో ఒక లాంటి సింథటిక్ ఈస్ట్రోజన్, ఎథినిల్ ఈస్ట్రడియాల్, ప్రొజెస్టెరాన్ ఉంటాయి. ఎథినిల్ ఈస్ట్రాడియాల్ ప్రతి నెల గర్భాశయంలో అండం పెరగకుండా ఆపుతుంది.

గర్భనిరోధక మాత్ర తీసుకున్న తరువాత చాలా మందిలో వికారంగా ఉండే సమస్యను ఎదుర్కొంటారు. తలనొప్పికి దారితీయవచ్చు. రుతు క్రమంలోను మార్పులు సంభవించే అవకాశాలు ఉంటాయి. గర్భనిరోధక మాత్రలు తీసుకునే వారిలో ఒత్తిడి, అనారోగ్యం, హార్మోన్లలో అసమానతలు తదితర కారణాల వల్ల రుతు క్రమంలో మార్పులు వస్తాయి. అదే సమయంలో రుతుస్రావంలో అధికంగా రక్త స్రావం కావటం, 6 నుండి 7రోజుల పాటు రుతుస్రావం వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఎక్కువగా వీటిని వినియోగిస్తే… భవిష్యత్తులో అసలు పిల్లలు పుట్టే అవకాశం లేకుండాపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. గర్భనిరోధక మాత్రలు వినియోగించే వారిలో బరువు పెరగటం వంటి సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ మాత్రల్లో ఉండే ప్రొజెస్టిన్‌ ఆకలిని పెంచుతుంది. కాబట్టి అవసరానికి మించి ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి.రొమ్ము సున్నితత్వాన్ని కోల్పోయి బరువుగా ఉన్న భావన కలుగుతుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో చాతిలో నిరంతరం నొప్పి అనిపిస్తుంటుంది. ఇలాంటి సందర్భంలో కెఫిన్, ఉప్పు వంటి పదార్ధాలను తగ్గించటం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

మధుమేహం, పొగ తాగే అలవాటు ఉన్న స్త్రీలు ఈ గర్భనిరోధక మాత్రలు వాడకపోవటమే మేలు. 10 సంవత్సరాల కంటే ఎక్కవ సమయం మాత్రలు తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె సమస్యలున్నవారు ఈ మాత్రలను వాడకపోవటం మంచిది. పిల్స్ వాడేవారు డైట్‌లో విటమిన్లు ఉండే ఆహారంతో పాటు ఫోలిక్ యాసిడ్ ఉండే పదార్థాలను తీసుకోవాలి. ఒత్తిడి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరానికి మించి గర్భనిరోదక మాత్రలను వాడకం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి.