Arjun Kapoor : మహిళా జర్నలిస్ట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ హీరో.. మరీ ఇంత దిగజారి వార్తలు రాస్తారా??

తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఓ వెబ్‌సైట్‌ లో మహిళా జర్నలిస్ట్ రాసిన కథనంని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ అయ్యాడు. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌...............

Arjun Kapoor : మహిళా జర్నలిస్ట్ పై ఫైర్ అయిన బాలీవుడ్ హీరో.. మరీ ఇంత దిగజారి వార్తలు రాస్తారా??

Arjun Kapoor fired on a female journalist

Arjun Kapoor :  ఇటీవల కొంతమంది వ్యూస్ కోసం, ట్రెండింగ్ కోసం ఫేక్ వార్తలని రాస్తున్నారు. కొన్ని సైట్స్, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అదే పనిగా ఫేక్ వార్తలని ప్రమోట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా వాళ్లనే టార్గెట్ చేసుకొని ఈ ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఇలాంటి వార్తలపై కొంతమంది చూసి చూడనట్టు వదిలేస్తుంటే మరికొంతమంది మాత్రం సీరియస్ అవుతున్నారు.

తాజాగా బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ ఓ వెబ్‌సైట్‌ లో మహిళా జర్నలిస్ట్ రాసిన కథనంని తన సోషల్ మీడియాలో షేర్ చేసి ఫైర్ అయ్యాడు. సీనియర్ హీరోయిన్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ డేటింగ్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఓ బాలీవుడ్ వెబ్‌సైట్‌ మలైకా కపూర్ ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు రాసింది. ఇది అర్జున్ కపూర్ దాకా వెళ్లడంతో ఆ వార్తని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు.

Vijay Devarakonda : ఈడీ విచారణపై విజయ్‌ దేవరకొండ వివరణ

ఆ వార్తని షేర్ చేస్తూ.. ”ఈ వెబ్‌సైట్‌, ఈ జర్నలిస్ట్ గతంలో కూడా ఇలాగే చాలా ఫేక్ వార్తలు రాశారు. మీరు సాధారణంగా భావించి రాసే వార్త మాకు ఎంత సెన్సిటివ్ అవుతుందో మీకు తెలియదు. ఇంతగా దిగజారి వార్తలు రాస్తారా?. ఇలాంటి వార్తలపై స్పందించట్లేదు కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాస్తారా. ఈ ఫేక్ వార్తలని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసి నిజాన్ని కనపడకుండా చేస్తున్నారు. మా వ్యక్తిగత జీవితాలతో ఆడుకునే ధైర్యం చేయకండి” అంటూ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చాడు.