బస్టాండ్ ని లైబ్రరీగా మార్చేసిన ఆర్మీ అధికారులు..క్యూ కడుతున్న విద్యార్ధులు

విద్యార్ధులు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్ధేశ్యంతో సైనికులు ఓ బస్టాండ్ ను లైబ్రరీగా మార్చేశారు. దక్షిణ కశ్మీర్‌లో ఉపయోగం లేకుండా ఉన్న బస్ స్టాండ్ ను విద్యార్ధుల కోసం లైబ్రరీగా మార్చేశారు

బస్టాండ్ ని లైబ్రరీగా మార్చేసిన ఆర్మీ అధికారులు..క్యూ కడుతున్న విద్యార్ధులు

Army bus stand to ‘street library’: విద్యార్ధులు చదువు పట్ల ఆసక్తి పెంచుకోవాలనే ఉద్ధేశ్యంతో సైనికులు ఓ బస్టాండ్ ను లైబ్రరీగా మార్చేశారు. దక్షిణ కశ్మీర్‌లో ఉపయోగం లేకుండా ఉన్న బస్ స్టాండ్ ను విద్యార్ధుల కోసం లైబ్రరీగా మార్చేశారు భారత ఆర్మీ అధికారులు. దీంతో ఓపెన్ గా ఉన్న బస్టాండ్ లైబ్రరీలోకి విద్యార్ధులు చక్కగా వచ్చి చదువుకుంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఆర్మీ అధికారులు ఇటువంటి వినూత్న పనికి చేపట్టారు.

బుక్స్ ఆఫ్ ఇండియా సంస్థ సహాయంతో ఈ వీధి (బస్టాండ్) లైబ్రెరీలో ఎన్నో పుస్తకాలు అందుబాటులో ఉంచారు. రాష్ట్రియ రైఫిల్స్ ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీకి స్థానికంగా మంచి ఆదరణ లభిస్తోంది. రాణీపూర్, చిత్తీసిగ్పురా, కెజ్రివల్, దేవీపురా గ్రామాలకు చెందిన విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ లైబ్రెరీ సేవలను వినియోగించుకుంటున్నారు.

పెద్ద తరగతి పిల్లలు లైబ్రెరీలో చదవడాన్ని చూసిన దిగువ తరగతుల విద్యార్థులు కూడా చదువుపై ఆసక్తి పెంచుకుంటున్నారు. దీంతో ఆర్మీ అధికారుల ప్రయత్నం ఫలించినట్లు అయ్యింది. ఈ లైబ్రరీ ఉదయం నుంచి సాయంత్రం వరకూ తెరుచునే ఉంటుంది. లైబ్రరీ తెరుచుకోగానే స్థానిక విద్యార్థులు ఈ బస్టాండ్ లైబ్రరీకి క్యూ కట్టి మరీ వస్తున్నారని ఓ ఆర్మీ అధికారి తెలిపారు.

మంచి పుస్తకాలు చదివితే పిల్లలకు మంచి సంస్కారంతో పలు విషయాలు తెలుస్తాయని అన్నారు. పుస్తకాలు చదువటం కేవలం విద్యార్థులకు అందరికీ మంచిదని..మనసు రిలాక్సయ్యేందుకు కూడా పుస్తకాలు ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. ఈ బస్టాండ్ లైబ్రెరీకి ఆదరణ పెరుగుతుండటంతో భవిష్యత్తులో మరిన్ని ప్రారంభిస్తామని ఆర్మీ అధికారులు తెలిపారు.