Pakistani Drone: మరోసారి డ్రోన్‌ను పంపి క‌ల‌క‌లం రేపిన పాకిస్థాన్‌

సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. ఓ డ్రోన్‌ను పంపి క‌ల‌క‌లం రేపింది. పాక్ చ‌ర్య‌ల‌ను భారత ఆర్మీ తిప్పికొట్టింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌నాచ‌క్ సెక్టార్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద గ‌గ‌న‌త‌లంలో భార‌త స‌రిహ‌ద్దు ద‌ళం (బీఎస్ఎఫ్‌) సిబ్బంది ఓ డ్రోనును గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు.

Pakistani Drone: మరోసారి డ్రోన్‌ను పంపి క‌ల‌క‌లం రేపిన పాకిస్థాన్‌

Russia-ukraine war

Pakistani Drone: సరిహద్దుల వద్ద పాకిస్థాన్ మరోసారి దుందుడుకు చర్యలకు పాల్పడింది. ఓ డ్రోన్‌ను పంపి క‌ల‌క‌లం రేపింది. పాక్ చ‌ర్య‌ల‌ను భారత ఆర్మీ తిప్పికొట్టింది. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌నాచ‌క్ సెక్టార్‌లోని అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దు వ‌ద్ద గ‌గ‌న‌త‌లంలో భార‌త స‌రిహ‌ద్దు ద‌ళం (బీఎస్ఎఫ్‌) సిబ్బంది ఓ డ్రోనును గుర్తించిన‌ట్లు అధికారులు తెలిపారు. గ‌త రాత్రి 9.40 గంట‌ల‌కు గ‌గ‌న‌తలంలో డ్రోనుకు సంబంధించిన రెడ్ లైట్ వెలుగుతూ క‌న‌ప‌డింద‌ని చెప్పారు. దీంతో డ్రోనుపై బీఎస్ఎఫ్ సిబ్బంది కాల్పులు జ‌రిపార‌ని వివ‌రించారు.

Maharashtra: శివసేన పార్టీ ఎవ‌రిది?.. ప‌త్రాలు స‌మ‌ర్పించాల‌ని ఈసీ ఆదేశం

ఆ డ్రోను తోక‌ముడుచుకుని వెనక్కు తిరిగింది. ఈ ఘ‌ట‌న‌తో క‌నాచ‌క్ ప్రాంతంలో అధికారులు సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు. ఈ ఆప‌రేష‌న్ ఇంకా కొన‌సాగుతుంద‌ని అధికారులు చెప్పారు. డ్రోన్ల ద్వారా జ‌మ్మూక‌శ్మీర్‌లోకి పాకిస్థాన్ పేలుడు ప‌దార్థాలు, ఆయుధాలు వంటివి పంపుతోంది. ఇటీవ‌లే పాక్ డ్రోన్లు పెద్ద ఎత్తున జార‌విడిచిన ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను భార‌త సైన్యం స్వాధీనం చేసుకుంది. స‌రిహ‌ద్దుల్లోకి ప‌దే ప‌దే డ్రోన్ల‌ను పంపుతూ పాక్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంది. పాక్ చ‌ర్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు భార‌త సైన్యం తిప్పికొడుతోంది.