Arpita Mukherjee: ఆ నాలుగు కార్లలో డబ్బేడబ్బు? ఆస్పత్రిలోకి రానంటూ బోరుమని విలపించిన అర్పితా ముఖర్జీ

పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేసులో విచారణనను వేగవంతం చేసినాకొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి.

Arpita Mukherjee: ఆ నాలుగు కార్లలో డబ్బేడబ్బు? ఆస్పత్రిలోకి రానంటూ బోరుమని విలపించిన అర్పితా ముఖర్జీ

Arpitha Muikarji

Arpita Mukherjee: పశ్చిమ బెంగాల్ పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈడీ (Enforcement Directorate) అధికారులు కేసులో విచారణనను వేగవంతం చేసినాకొద్దీ వెలుగులోకి కొత్త విషయాలు వస్తున్నాయి. ఇప్పటికే అర్పితా ముఖర్జీ సంచలన విషయాలను ఈడీ విచారణలో వెల్లడించడంతో రోజుకో కొత్త విషయం తెలుస్తోంది. కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థా ఛటర్జీ చుట్టూ ఈడీ ఉచ్చుబిగుస్తోన్న వేళ మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అర్పితా ముఖర్జీకి చెందిన నాలుగు లగ్జరీ కార్లలో డబ్బును దాచిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కార్లలో పెద్ద ఎత్తున డబ్బు ఉన్నట్లు సమాచారం రావడంతో వాటి కోసం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా జల్లెడ పడుతున్నట్లు తెలిసింది.

Arpita Mukherjee: అర్పిత మరో ఫ్లాట్ నుంచి 29 కోట్లు స్వాధీనం

అర్పితా ముఖర్జీకి అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. వాటిలో తెల్లరంగు మెర్సిడెస్, ఆడీ ఏ4, హోండా సిటీ, హోండా సీఆర్ వీ, మరో బెంజ్ కారు కూడా ఉన్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిస్తోంది. అయితే అర్పితాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నప్పుడు తెల్లరంగు మెర్సిడెస్ కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో భాగంగా మిగిలిన నాలుగు కార్లు ఎటుపోయాయనే అంశాన్ని ఈడీ అధికారులు ప్రశ్నించినప్పటికీ అర్పితా నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. అయితే మిగిలిన నాలుగు కార్లలో భారీగా డబ్బున్నట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. వాటికోసం పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎక్కడికక్కడ సీసీ టీవీ పుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

Arpita Mukherjee : మంత్రి వారానికోసారి నా ఇంటికి వచ్చేవారు-నటి అర్పిత

ఇప్పటికే అర్పితా ఇళ్లలో దాడులు జరిపిన సమయంలో ఈడీ అధికారులు సుమారు 50కోట్ల నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ డబ్బంతా మాజీ మంత్రి పార్థా ఛటర్జీదేనని, ఆ డబ్బు ఉన్న గదికి తనను వెళ్లనిచ్చేవారు కాదని అర్పిత ఈడీ అధికారులకు తెలిపినట్లు తెలుస్తోంది. మొత్తానికి పశ్చిమ బెంగాల్ లోని పాఠశాల ఉపాధ్యాయ నియామకాల కుంభకోణం కేసులో ఛటర్జీ, అర్పితాలను విచారిస్తున్నా కొద్దీ ఆశ్చర్యపర్చే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Arpita Mukherjee: మమత ప్రభుత్వంలో అర్పిత ముఖర్జీ పాత్ర ఏమిటి? మంత్రితో ఆమెకున్న సంబంధం అదేనా? ఈడీ ఏం చెబుతోంది..

ఇదిలాఉంటే అర్పితా ముఖర్జీ విలపించారు, నిరసన తెలిపారు. ఆమెను కోర్టు సూచనల మేరకు వైద్య పరీక్షల కోసం శుక్రవారం జోకాలోని ఈఎస్ఐ ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు కారు దిగడానికి అర్పితా నిరాకరించారు. మొదట ఆమె కారును విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. ఆమె చేతులు ఊపుతూ, బయటికి రావాలని కోరుకునే భద్రతా అధికారులతో రానుఅంటూ ఏడ్చింది. ఆమెను బలవంతంగా బయటకు తీసుకురాగా, నేలపై కూర్చుంది. భద్రతా సిబ్బంది ఆమెను లోపలికి వెళ్లమని ఒప్పించేందుకు ప్రయత్నించడం, ఆపై ఆమెను లాగడం కనిపించింది. చివరికి అర్పితా ముఖర్జీని బలవంతంగా తీసుకెళ్ళారు, ఈ సమయంలో వీల్ చైర్ మీద ఏడుస్తూనే ఆమె కనిపించింది.